లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) సీజన్ 2ని ఇండియాలో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు జట్లు (ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్) పాల్గొనే ఈ టోర్నీలో ఆడే ప్లేయర్లు అందరూ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చినవాళ్లే. తాజాగా ఎల్‌ఎల్‌సీ సీజన్ 2లో విండీస్ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఆడబోతున్నాడు...
సీజన్ 2ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 8 వరకూ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు నిర్వాహాకులు. ఈసారి భారత్‌లోని ఆరు నగరాల్లో ఎల్‌ఎల్‌సీ మ్యాచులు జరగబోతున్నాయి...
28
World Giants
కోల్‌కత్తా, లక్నో, ఢిల్లీ, జోధ్‌పూర్, కటక్, రాజ్‌కోట్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2 మ్యాచులను నిర్వహించబోతున్నట్టు ఎల్‌ఎల్‌సీ సీఈవో రమన్ రహేజా తెలియచేశారు...
38
Asia Lions
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈసారి లెజెండ్స్ లీగ్‌లో పాల్గనబోతున్నట్టు ఇప్పటికే కన్ఫార్మ్ చేశాడు. అలాగే రాస్ టేలర్, లాన్స్ క్లుసేనర్, డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్.. సీజన్ 2లో పాల్గొనబోతున్నారు...
48
ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ రవి బోపారా, మ్యాట్ ప్రియర్, క్రిస్ ట్రెమ్లెట్, శ్రీలంక క్రికెటర్ పర్వాజ్ మహరూఫ్, రమేశ్ కలువితరణ, ఉపుల్ తరంగ... లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2లో పాల్గొనబోతున్నారు...
58
వీరితో పాటు వెస్టిండీస్ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్2లో ఆడబోతున్నట్టు సమాచారం. 1999 అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 42 ఏళ్ల క్రిస్ గేల్... ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు...
68
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆఖరిసారిగా వెస్టిండీస్ తరుపున బరిలో దిగిన క్రిస్ గేల్, 2022 ఐపీఎల్ మెగా వేలానికి కూడా పేరు రిజిస్టర్ చేయించుకోలేదు. అయితే వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆడతానని కామెంట్ చేశాడు...
78
తాజాగా రిటైర్మెంట్ ఇచ్చిన లెజెండరీ ప్లేయర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్న క్రిస్ గేల్, అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. అని సంకేతాలు ఇచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
88
మొదటి సీజన్‌లో వరల్డ్ జెయింట్స్‌కి టైటిల్ అందించిన వరల్డ్ జెయింట్స్ తరుపున క్రిస్ గేల్ ఆడే అవకాశం ఉంది. లేదా ప్లేయర్లు పెరగడంతో ఈసారి జట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు...