కావాలంటే లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తా... అశ్విన్ పోస్ట్ వైరల్, ధావన్ కామెంట్...

First Published Aug 27, 2021, 6:38 PM IST

టెస్టుల్లో అత్యంత వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంగ్లాండ్ టూర్‌లో తుది జట్టులో ప్లేస్ కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. అశ్విన్ లేకుండా భారత జట్టు వరుసగా మూడు టెస్టులు ఆడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు...

రవీంద్ర జడేజా బ్యాటుతో రాణిస్తుండడంతో ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కడం లేదు. అశ్విన్ లేకపోవడంతో జో రూట్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు...

రవీంద్ర జడేజా 54 టెస్టుల్లో ఓ సెంచరీతో 2,084 పరుగులు చేస్తే, రవిచంద్రన్ అశ్విన్‌కి 79 టెస్టుల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి... అయినా ‘విన్నింగ్ కాంబినేషన్’ పేరుతో అశ్విన్‌ని పక్కనబెట్టి, జడేజాకి చోటు ఇస్తున్నాడు విరాట్ కోహ్లీ...

వరుసగా మూడు టెస్టుల్లో తుది జట్టులో చోటు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు కనిపించిన రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది... 

రవీంద్ర జడేజాలా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రవిచంద్రన్ అశ్విన్... ‘ప్రతీరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే ఆకాంక్ష, ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది...’ అంటూ కాప్షన్ జత చేశాడు...

అశ్విన్ పోస్టుకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్...‘లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లాగే కనిపిస్తున్నావ్ బ్రో... క్లాసీ...’ అంటూ కామెంట్ చేశాడు...

తనకి టెస్టులో జడేజా కంటే ఎక్కువ పరుగులు, ఎక్కువ వికెట్లు ఉన్నా, తనకి చోటు దక్కకపోవడానికి లెఫ్ట్ హ్యాండ్‌లో బ్యాటింగ్ చేయలేకపోవడమేనేమో అన్నట్టుగా అశ్విన్ పోస్టు ఉందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

మరికొందరేమో తాను బ్యాటింగ్‌లోనూ రవీంద్ర జడేజా కంటే తక్కువేమీ కాదని, పరోక్షంగా విరాట్ కోహ్లీ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి అర్థమయ్యేలా అశ్విన్ చెబుతున్నాడని అంటున్నారు...

click me!