ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 7 నుంచి మొదలయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం నెల రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. ఐపీఎల్ ముగించుకుని ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు కూడా ప్రాక్టీస్ మొదలెట్టింది..
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి ప్రకటించిన భారత జట్టులో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అజింకా రహానే రావడం ఫిక్స్...
27
బౌలర్లుగా మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఇద్దరూ ఉండడం పక్కా. మిగిలిన స్థానాల గురించే పూర్తి స్పష్టత లేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ని ఆడిస్తారా? లేక ఆసీస్‌పై ఆడిన అనుభవం ఉన్న శ్రీకర్ భరత్‌కి ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది...
37
Image credit: Getty
అలాగే గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మాదిరిగా ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతారా? లేక ఓవల్ పిచ్‌కి తగ్గట్టుగా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌తో ఆడతారా? అలా అయితే రవీంద్ర జడేజాని ఆడిస్తారా? రవిచంద్రన్ అశ్విన్‌కి చోటిస్తారా? ఈ విషయంపై తీవ్ర తర్జన భర్జన పడుతోందట క్రికెట్ ఆస్ట్రేలియా...
47
ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్ 25 వికెట్లు తీస్తే, రవీంద్ర జడేజా 22 వికెట్లు పడగొట్టాడు. అయితే 2021 ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన నాలుగు టెస్టుల్లో రవీంద్ర జడేజా ఆడితే, రవిచంద్రన్ అశ్విన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..
57
‘రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడిస్తారా? జడేజాని ఆడిస్తారా? అనే విషయంపై టీమ్ మీటింగ్‌లో చర్చించాం. నాకు తెలిసి జడేజాకి తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఎందుకంటే జడేజా ఆరో స్థానంలో బ్యాటర్‌గా కూడా సక్సెస్ అయ్యాడు...
67
Image credit: Getty
మరి ఫోర్త్ సీమర్‌గా ఎవరిని ఆడిస్తారు? అని కూడా ఆలోచిస్తున్నాం. శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వస్తే ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని అనుకోవచ్చు. లేదా ఉమేశ్ యాదవ్‌ని తెస్తారా? లేక అశ్విన్, జడేజా ఇద్దరినీ ఆడిస్తారా? అనే విషయాలపై ఫోకస్ పెట్టాం..
77
అశ్విన్ అద్భుతమైన బౌలర్, అయితే కొన్నిసార్లు టీమ్ కాంబినేషన్ కోసం అతన్ని పక్కన బెట్టడం తప్పకపోవచ్చు. ఓవల్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తుంది. స్పిన్నర్లకు కూడా సహాకారం ఉంటుంది. కాబట్టి అశ్విన్ ఆడతాడనే అనుకుంటున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ విటోరీ...