అప్పుడు, ఇప్పుడు సేమ్ టు సేమ్! 2011ని రిపీట్ చేసిన ఐపీఎల్ 2023... వన్డే వరల్డ్ కప్ గెలవడమే బాకీ...

First Published Jun 3, 2023, 11:40 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసింది. ఐదో ఐపీఎల్ టైటిల్‌ని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌కి, 2011 ఐపీఎల్‌కి మధ్య చాలా పోలికలు ఉండడం విశేషం...

2011 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున అన్‌క్యాప్డ్ ప్లేయర్ పాల్ వాల్తేటి సెంచరీ చేశాడు. 12 ఏళ్ల తర్వాత 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నుంచి అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సెంచరీ సాధించాడు...

2011 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడింది...
 

2011 సీజన్‌లో ఆర్‌సీబీ ఓపెనర్ క్రిస్ గేల్, సీజన్‌లో 44 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. 2023 సీజన్‌లో ఆర్‌సీబీ ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, 36 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు..

2011 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ, 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి సీజన్‌లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 2023 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మద్వాల్ 5 పరుగులకే 5 వికెట్లు తీసి సీజన్‌లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు...

2011లో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్, రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడింది. 2023 సీజన్‌లోనూ ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్, రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది...
 

2011 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన క్రిస్ గేల్, ఫైనల్ మ్యాచ్ ఆడినా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాడు. 2023 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన శుబ్‌మన్ గిల్ కూడా ఫైనల్ మ్యాచ్ ఆడినా టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు..

Sachin Tendulkar

2011 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్‌ టైటిల్ గెలవగా, 2023 సీజన్‌లోనూ సీఎస్‌కేనే టైటిల్ వరించింది. సరిగ్గా 2011లో వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన బీసీసీఐ, ఈసారి మళ్లీ వన్డే వరల్డ్ కప్‌కి వేదిక ఇవ్వనుంది..

దీంతో ఐపీఎల్‌లో సేమ్ సీన్ రిపీట్ అయినట్టే, 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ గెలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఫ్యాన్స్. అయితే 2011లో ఐపీఎల్ టోర్నీకి ముందే వరల్డ్ కప్ జరిగింది. ఈసారి మాత్రం ఐపీఎల్ అయ్యాక ఆరు నెలలకు వన్డే వరల్డ్ కప్ జరగనుంది.. 

click me!