ఒక్క వికెట్‌కి రూ.10 కోట్లు... ఐపీఎల్ 2023 సీజన్‌లో మోస్ట్ కాస్ట్‌లీ ప్లేయర్‌గా లూకీ ఫర్గూసన్...

First Published Jun 3, 2023, 12:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసింది. ఎప్పటిలాగే కోట్లు పెట్టి కొన్న ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ కాగా, పెద్దగా అంచనాలు లేని బేస్ ప్రైజ్ ప్లేయర్లు అదరగొట్టారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన లూకీ ఫర్గూసన్, మెజారిటీ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..

ఆడిన 3 మ్యాచుల్లో 1 వికెట్ మాత్రమే తీసిన లూకీ ఫర్గూసన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యంత కాస్ట్‌లీ ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022 వేలంలో లూకీ ఫర్గూసన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్, అతన్ని కేకేఆర్‌తో ట్రేడ్ చేసుకుంది... 2021 తర్వాత తిరిగి కేకేఆర్‌లోకి వచ్చిన లూకీ, ఒక్క వికెట్‌కి రూ.10 కోట్లు తీసుకున్నాడు.
 

ఐపీఎల్ 2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని జోఫ్రా ఆర్చర్, ఈ సీజన్‌లో మొత్తంగా 2 వికెట్లు తీశాడు. అంటే రెండు సీజన్లలో కలిపి రూ.16 కోట్లు తీసుకున్న ఆర్చర్... ఒక్క వికెట్‌కి రూ.8 కోట్లు అందుకున్నాడు..

గతంలో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన కార్తీక్ త్యాగిని, ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒకే వికెట్ తీసిన కార్తీక్ త్యాగి... తీసిన ఒక్క వికెట్‌కి రూ.4 కోట్లు తీసుకున్నాడు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 మ్యాచులు మాత్రమే జోష్ హజల్‌వుడ్, గాయం కారణంగా మెజారిటీ మ్యాచులకు దూరంగా ఉన్నాడు. జోష్ హజల్‌వుడ్‌ని రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. ఈ సీజన్‌లో 3 వికెట్లు తీసిన హజల్‌వుడ్, ఒక్కో వికెట్‌కి రూ.2.58 కోట్లు అందుకున్నాడు.. 

ఐపీఎల్ 2022 మెగా వలేంలో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లు పోసి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గాయంతో 2022 సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహార్, 2023 సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చి 13 వికెట్లు తీశాడు. మొదటి 4 మ్యాచుల్లో వికెట్ తీయని దీపక్ చాహార్, ఆ తర్వాత 5 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. అయినా తీసిన ఒక్క వికెట్‌కి రూ.1.07 కోట్లు తీసుకుంటున్నాడు దీపక్ చాహార్...

Image credit: PTI

ఐపీఎల్ 2023 మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో 2 మ్యాచులు ఆడి 15 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చేసిన ఒక్కో పరుగుకి రూ.1.25 కోటి అందుకున్నాడు బెన్ స్టోక్స్..  
 

Image credit: PTI

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీ బౌలర్‌గా ఉన్న ఆవేశ్ ఖాన్‌ని, ఐపీఎల్‌ 2022 వేలంలో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ సీజన్‌లో 8 వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్, ఒక్కో వికెట్‌కి రూ.1.25 కోట్లు అందుకున్నాడు..

RABADA

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన కగిసో రబాడానికి రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఈ సీజన్‌లో 7 వికెట్లు మాత్రమే తీసిన కగిసో రబాడా, ఒక్కో వికెట్‌కి రూ.1.39 కోట్లు అందుకుంటున్నాడు..

click me!