గాయంతో ఏడాదికి పైగా టీమ్‌కి దూరంగా జస్ప్రిత్ బుమ్రా, రీఎంట్రీలో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో జస్ప్రిత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగిపోయాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఆల్‌రౌండ్ షో ఇచ్చాడు...
పార్ట్ టైం కెప్టెన్‌గా 2018 ఆసియా కప్ టైటిల్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే అప్పుడు క్రెడిట్ మొత్తం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే వెళ్లింది. కారణం కోహ్లీ గైర్హజరీలో ధోనీయే రియల్ కెప్టెన్‌గా ఉన్నాడని, రోహిత్ కేవలం యాక్టింగ్ కెప్టెన్ అని విమర్శలు వచ్చాయి..
ఈ విమర్శలకు ఐదేళ్ల తర్వాత సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ. రెండు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన మూడో భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంతకుముందు మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెస్ ధోనీ మాత్రమే రెండేసి సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచారు..
వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఏ భారత కెప్టెన్ కూడా రెండు సార్లు కూడా 10 వికెట్ల తేడాతో వన్డేల్లో విజయాన్ని అందుకోలేకపోయారు.
ఇంతకుముందు వెంకటరాఘవన్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, గంగూలీ, ధోనీ, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఒక్కోసారి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది భారత జట్టు..
వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో (శ్రీలంకపై 2023 జనవరిలో 317 పరుగుల తేడాతో ) గెలిచిన భారత జట్టు, అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ నిలిచింది. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ 6.1 ఓవర్లలోనే ముగించింది టీమిండియా..
మిడిల్ ఆర్డర్‌లో కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కుదురుకున్నారు. శ్రేయాస్ అయ్యర్ గాయపడినా అతను లేని లోటు అయితే కనిపించకుండా చేయగలిగింది టీమిండియా. అయ్యర్ కోలుకున్నా, వరల్డ్ కప్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావచ్చు..
టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మకు దక్కిన అతి పెద్ద విజయం ఇదే. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ 2023 ఫైనల్‌లో వన్ సైడ్ విక్టరీ, టీమిండియాలో రెట్టింపు జోష్ నింపింది...