అతనొక్కడూ ఫామ్‌లో ఉంటే సిరీస్ మనదే!... రవిచంద్రన్ అశ్విన్‌పై రవిశాస్త్రి కామెంట్...

Published : Feb 07, 2023, 11:48 AM IST

టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు అసలైన ఛాలెంజ్. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనలిస్టులను డిసైడ్ చేసే సిరీస్.. రిషబ్ పంత్ లేకుండా రెండేళ్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా.. ఇలా ఇప్పుడు అందరి చూపు బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌పైనే ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...  

PREV
16
అతనొక్కడూ ఫామ్‌లో ఉంటే సిరీస్ మనదే!... రవిచంద్రన్ అశ్విన్‌పై రవిశాస్త్రి కామెంట్...

‘రవిచంద్రన్ అశ్విన్.. స్వదేశంలో టీమిండియాకి మ్యాచ్ విన్నర్... అతనొక్కడు సరైన ఫామ్‌లో ఉంటే టీమిండియాదే సిరీస్. అశ్విన్ కొత్త ప్లాన్స్‌తో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్లాన్‌ని అమలు చేయాలో అతనికి బాగా తెలుసు...

26

అశ్విన్ ఓ ప్యాకేజీ ప్లేయర్. అతనికి ఐదు టెస్టు సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటుతో అశ్విన్ చేసే పరుగులు, టీమిండియాకి చాలా అమూల్యమైనవి. అశ్విన్ అదరగొడితే, టెస్టు సిరీస్ వన్‌సైడ్ అయిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అశ్విన్ వరల్డ్ క్లాస్ బౌలర్, ఇండియాలో అయితే అతను మహా డేంజరస్ బౌలర్..

36

అశ్విన్ బాల్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్వదేశంలో అశ్విన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి ఏ బ్యాటర్ అయినా ఇబ్బందిపడాల్సిందే. అశ్విన్‌ని పక్కనబెట్టాలంటే మ్యాచ్‌ని ప్రత్యర్థులకు వదిలిపెట్టేసినట్టే అవుతుంది. పిచ్ ఎలా ఉన్నా, అశ్విన్ టీమ్‌లో ఉండాల్సిందే...
 

46
Kuldeep Yadav

ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బౌలింగ్ దాదాపు ఒకేలా ఉంటుంది. కుల్దీప్ యాదవ్ స్టైల్ మాత్రం భిన్నమైనది. టాస్ ఓడిపోతే తొలి రోజు నుంచే స్పిన్ తిప్పగల బౌలర్లు కావాలి...

56

బ్యాటింగ్ పిచ్ మీద కూడా బంతిని స్పిన్ చేయగల సత్తా కుల్దీప్ యాదవ్‌ సొంతం. అందుకే అతన్ని ఆడించడం చాలా ముఖ్యం. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లో ఎవరిని ఆడించినా బ్యాటుతో, బాల్‌తో రాణించగలరు. అక్షర్ పటేల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
 

66
Kuldeep Yadav

రవిచంద్రన్ అశ్విన్ మాత్రం స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా విజయావకాశాలు 55 శాతం ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, ఒప్పుకుంటున్నా.. అంటూ రిప్లై ఇచ్చాడు అశ్విన్.. 

click me!

Recommended Stories