పూజారా పేరు చెప్పగానే క్యాప్ పడేసి, మీటింగ్ నుంచి వెళ్లిపోయిన హజల్‌వుడ్... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో...

First Published Feb 7, 2023, 10:55 AM IST

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే ఈ టెస్టు సిరీస్ విజయం కీలకం కావడంతో ఇరుజట్లు తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. రిషబ్ పంత్ గాయంతో ఈ సిరీస్ ఆడడం లేదు. దీంతో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ కీలకంగా మారారు...

98 టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారా, ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుతో 100 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్నాడు. ఛతేశ్వర్ పూజారా, జోష్ హజల్‌వుడ్ మధ్య ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని ఐసీసీ కామెంట్ చేసింది... పూజారాని జోష్ హజల్‌వుడ్ 6 సార్లు అవుట్ చేశాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ బాటిల్‌కి కారణం అది కాదు...

Rishabh Pant-Pujara

2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా... టిక్కు... టిక్కుమంటూ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయి చూసేవారికే కాదు, బౌలింగ్ వేసేవారి ఓపికకి పరీక్ష పెట్టాడు పూజారా... ఒక్క సింగిల్ తీయడానికి 40-50 బంతులు వాడేశాడు పూజారా...

బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంలో క్రెడిట్ రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వంటి కుర్రాళ్లకు దక్కింది. అయితే ఈ టెస్టులో పూజారా ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు వేసే బౌన్సర్లు బలంగా తగిలి ఒంటికి ఎన్ని గాయాలైనా, గోడలా నిలబడిపోయాడు పూజారా...

భారత బ్యాటింగ్ లైనప్‌కి వెన్నెముకగా నిలిచిన పూజారా, నాలుగు టెస్టుల్లో కలిపి 900లకు పైగా బంతులు ఎదుర్కొన్నాడు. తానొక్కడే నాలుగు టెస్టుల్లో కలిపి 154.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పూజారా, తన జిడ్డు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు విసుగు తెప్పించాడు..

‘‘ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఓ సంఘటనను ఓ ఆసీస్ ప్లేయర్ నాతో చెప్పాడు. బ్రిస్బేన్ టెస్టుకి ముందు శాళ్లు టీమ్ మీటింగ్‌లో పూజారాను ఎలా అవుట్ చేయాలనే విషయంపై చర్చించుకుంటున్నారట. అప్పుడు జోష్ హజల్‌వుడ్ తన క్యాప్ తీసి, నేలకేసి కొట్టి వెళ్లిపోయాడట....
 

‘ఎక్కడ చూసినా పూజారానే కనిపిస్తున్నాడు.  బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనే ఉంటాడు... క్రికెట్ ఫీల్డ్‌లో పూజారానే ఎక్కువగా కనిపిస్తున్నాడు... ఇప్పుడు ఇక్కడ కూడా! నా వల్ల కాదు...’ అంటూ అసహనంతో బయటికి వెళ్లిపోయాడట జోష్ హజల్‌వుడ్...’’ అంటూ 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో జరిగిన సంఘటనను బయటపెట్టాడు అప్పటి ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.. 

జోష్ హజల్‌వుడ్ గాయం కారణంగా తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు. అలాగే సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా గాయంతో బాధపడుతూ మొదటి టెస్టు ఆడడం లేదు. కామెరూన్ గ్రీన్ తొలి టెస్టులో బౌలింగ్ వేయడం కష్టమేనని తేల్చేశారు.. 

గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 21 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన ప్యాట్ కమ్మిన్స్ కూడా ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్ గురించి గొప్పగా మాట్లాడాడు... ‘మేం భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగాం. ఆడలేని బంతులు వేసి అవుట్ చేయగలం కానీ పూజారా పట్టుదల మాత్రం మా బౌలర్ల పవర్ నిలవలేకపోయింది’ అని అన్నాడు ప్రస్తుత ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్...

click me!