ఈసారి వన్డే వరల్డ్ కప్ మనదే! అయితే అదొక్కటే అసలు చిక్కు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

Published : Jan 21, 2023, 04:27 PM IST

కొందరు క్రికెటర్లు, రిటైర్మెంట్ తీసుకున్నాక విశ్లేషకులుగా మారి యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే రవిచంద్రన్ అశ్విన్‌ మాత్రం రిటైర్మెంట్‌కి ముందే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాడు.. 

PREV
19
ఈసారి వన్డే వరల్డ్ కప్ మనదే! అయితే అదొక్కటే అసలు చిక్కు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

2020-21 ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయం తర్వాత ‘కుట్టీ స్టోరీస్’ సిరీస్ వీడియోలతో  డ్రెస్సింగ్ రూమ్ విషయాలను అభిమానులతో పంచుకున్న రవిచంద్రన్ అశ్విన్, భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు...

29
Rohit Sharma

స్వదేశంలో టీమిండియాకి ఘనమైన రికార్డు ఉంది. భారత్‌లో జరిగిన గత 18 వన్డే మ్యాచుల్లో 14 విజయాలు టీమిండియా. అయితే ఈ 18 మ్యాచులు కూడా 14 భిన్నమైన వేదికల్లో జరగడం విశేషం...

39
Image credit: PTI

‘2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్‌లో భారత జట్టు వన్డే రికార్డు బాగుంది. ఇండియాలో ఆడిన ప్రతీ వన్డే సిరీస్‌లోనూ భారత జట్టే గెలిచింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై విజయాలు అందుకుంది...
 

49
rohit sharma

18 వన్డేల్లో 14 విజయాలు అంటే దాదాపు 78 నుంచి 80 శాతం. అయితే ఈ 18 వన్డే మ్యాచులను 14 భిన్నమైన వేదికల్లో నిర్వహించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలను చూసుకుంటే వాళ్ల పద్ధతి ఇలా ఉండదు...

59
Image credit: Getty

కొన్ని వేదికలను ఫిక్స్ చేసుకుని, అక్కడే మ్యాచులన్నీ నిర్వహిస్తూ ఉంటారు. టెస్టు మ్యాచుల కోసం 4-5 స్టేడియాలు ఉంటే, వన్డే మ్యాచుల కోసం 2-3 వేదికలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఎలా ఆడితే గెలవగలమో ప్లేయర్లకు పూర్తి క్లారిటీ వస్తుంది..
 

69

2011 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇండియాలో జరిగిన వరల్డ్ కప్‌ని ఇండియా, ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్‌ని ఆస్ట్రేలియా, 2019 ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌ని ఇంగ్లాండ్ గెలిచాయి. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఎక్కడ ఎలా ఆడాలో వాళ్లకు బాగా తెలుసు. హోం అడ్వాంటేజ్‌ని బాగా వాడుకున్నారంతే...

79
Image credit: PTI

అయితే ఇండియా విషయానికి వచ్చేసరికి ఆ అడ్వాంటేజ్ చాలా తక్కువ. ఎందుకంటే మనకి టెస్టులు, వన్డేలు, టీ20ల కోసం స్పెషల్‌గా వేదికలు లేవు. మన షెడ్యూల్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో ఓ మ్యాచ్ ఆడి, అక్కడ ముంబైలో మరో మ్యాచ్ ఆడతారు...

89
Image credit: PTI

ఇన్ని నగరాలు, ఇన్ని వేదికలు, ఇన్ని స్టేడియాలు ఉన్నప్పుడు అందులో హోం అడ్వాంటేజ్ ఎక్కడిది? టీమిండియా ఓడిన నాలుగు మ్యాచులు కూడా చెన్నై, ముంబై, పూణే, లక్నోల్లో జరిగాయి. అవి కూడా మొదటి సారి బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లోనే భారత జట్టు ఎక్కువగా ఓడింది... అంటే కండీషన్‌ని ఎలా వాడుకోవాలో తెలియదనేగా...
 

99
Image credit: PTI

ఈసారి వన్డే వరల్డ్ కప్ మనదే! అయితే అసలు సమస్య మనవాళ్లు ఈ హో అడ్వాంటేజ్‌ని ఎలా వాడుకుంటున్నారు? షెడ్యూల్‌ని ఎలా డిసైడ్ చేస్తారనేదానిపైనే ఆధారపడి ఉంది... ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వాడుకున్నట్టే చేస్తే... మనల్ని ఎవ్వరూ ఆపలేరు...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.. 

click me!

Recommended Stories