మైకేల్ క్లార్క్ చెంప చెళ్లుమనిపించిన గర్ల్‌ఫ్రెండ్... ముదురుతున్న వివాదం! ఆ సిరీస్ నుంచి అవుట్..

First Published Jan 21, 2023, 12:55 PM IST

ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన ఆసీస్ మాజీ కెప్టెన్, 2015 వన్డే వరల్డ్ కప్ విజేత మైకేల్ క్లార్క్‌ మూడో గర్ల్‌ఫ్రెండ్ వివాదం ముదురుతోంది.. తాజాగా మైకెల్ క్లార్క్‌ తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన ఆయన గర్ల్‌ఫ్రెండ్ యాబ్రో, ఆసీస్ మాజీ సారథితో పబ్లిక్‌గా గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా నిలిచిన మైకేల్ క్లార్క్, 2008లో మోడల్ లారా బింగెల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. 2010లో ఈ ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకుని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు...

లారాతో తెగతెంపులు చేసుకున్న తర్వాత 2012 మేలో కెలీ బోల్డీని వివాహం చేసుకున్నాడు మైకేల్ క్లార్క్. ఈ ఇద్దరికీ ఓ కూతురు కూడా పుట్టింది. అయితే 8 ఏళ్ల కాపురం తర్వాత బోల్డీతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు మైకేల్ క్లార్క్...

2020లో మరో ఫ్యాషన్ బిజినెస్ ఓవర్ పిప్ ఎడ్వర్డ్స్‌తో డేటింగ్ చేసిన మైకేల్ క్లార్క్, ఏడాది తర్వాత ఆమెతో కూడా విడిపోయాడు... తాజాగా జెడ్ యాబ్రోతో పబ్లిక్‌గా గొడవపడుతూ మీడియాకి దొరికిపోయాడు మైకేల్ క్లార్క్...

Michael Clarke-Jade Yarbrough

మైకేల్ క్లార్క్ తనను మోసం చేశాడని ఆరోపించిన యాబ్రో, ఆసీస్ మాజీ క్రికెటర్‌తో పబ్లిక్‌గా గొడపడడం, కొట్టడం కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. యాబ్రో చెల్లెలు జాస్మిన్, అక్కను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం కూడా ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది...

మైకేల్ క్లార్క్, తన మాజీ గర్ల్ ఫ్రెండ్ పిప్ ఎడ్వర్డ్స్‌తో సెక్స్ చేశాడని ఆరోపణలు చేసింది యాబ్రో. అయితే క్లార్క్ మాత్రం అలాంటిదేమీ లేదని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు... జాస్మిన్ బాయ్‌ఫ్రెండ్, టీవీ ప్రెసెంటర్ కార్ల్ స్టీఫెనోవిక్ కూడా ఈ గొడవ సమయంలో వీరితోనే ఉండడం విశేషం...  

Michael clarke, Kyly

‘నేను మహిళలను గౌరవిస్తాను. నేను ఎంతో గౌరవించే వ్యక్తులు, నన్ను ఇలాంటి పొజిషన్‌లో పడేయడం బాధగా ఉంది. అయితే నేను చేసిన కొన్ని సిగ్గుమాలిన పనుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది.. నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నా...’ అంటూ టెలిగ్రాఫ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మైకేల్ క్లార్క్..

ప్రస్తుతం ఐసీసీ బ్రాడ్‌కాస్ట్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న మైకేల్ క్లార్క్‌పై ఈ వివాదం తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వివాదంలో ఇరుక్కున్న మైకేల్ క్లార్క్‌ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2022-23 సిరీస్ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

click me!