దాన్ని డిలీట్ చేసేయ్! మళ్లీ మొదలెట్టు... అర్ష్‌దీప్ సింగ్‌కి బ్రెట్ లీ సలహా..

First Published Jan 21, 2023, 3:39 PM IST

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా ఐదు నో బాల్స్ వేసి చెత్త రికార్డు నెలకొల్పాడు అర్ష్‌దీప్ సింగ్. గాయం కారణంగా తొలి టీ20కి దూరంగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్, రెండో మ్యాచ్‌లో తుదిజట్టులోకి వచ్చాడు. అయితే రిథమ్ అందుకోలేక నో బాల్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు...

మొదటి ఓవర్‌లో 3 నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్, ఆఖర్లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చి 2 నో బాల్స్ ఇచ్చాడు. మొత్తంగా ఒకే మ్యాచ్‌లో 5 నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్, తన టీ20 కెరీర్‌లో 12 నో బాల్స్ వేసి టీమిండియా తరుపున టాప్‌లో నిలిచాడు...
 

Image credit: Getty

‘శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌ని నేను చూశాను. అర్ష్‌దీప్ సింగ్ పూర్తిగా తన బౌలింగ్‌పై కంట్రోల్ కోల్పోయినట్టు అనిపించింది. నో బాల్ తర్వాత నో బాల్, ఆ తర్వాత మరో నో బాల్ వేస్తూ పోయాడు... ఒకే మ్యాచ్‌లో 5 నో బాల్స్ వేయడం అంటే క్షమించరాని నేరం...

Image credit: Getty

ఈ పర్ఫామెన్స్‌ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అదీకాకుండా అతను వేసిన 2 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేశాడు. గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు కాబట్టి రిథమ్ అందుకోవడానికి సమయం పడుతుంది. అయితే ప్రాక్టీస్ లేకుండా అతన్ని ఆడించాల్సిన అవసరం ఏమొచ్చింది...

arshdeep

గాయపడిన తర్వాత ప్రతీ బౌలర్ తన షేప్‌ని, మోమెంటమ్‌ని కోల్పోతాడు. ప్రతీ బౌలర్ వికెట్లు తీసి, కెప్టెన్‌ని సంతోషపెట్టాలని చూస్తాడు. అయితే నో బాల్స్ వేయడం వల్ల వికెట్లు దక్కకపోగా బ్యాట్స్‌మెన్‌కి ఫ్రీగా ఏదైనా ఆడే ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది...

నో బాల్స్, బౌలర్‌ని మానసికంగా దెబ్బ తీస్తాయి. ఎందుకంటే నో బాల్ వల్ల ఎక్స్‌ట్రా బాల్ వేయడమే కాదు, నీకు నచ్చింది కొట్టుకో అని బ్యాట్స్‌మెన్‌కి లైసెన్స్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. నా సలహా ఒక్కటే... ముందు ఆ సంఘటనను నీ మైండ్‌లో నుంచి డిలీట్ చెయ్...

Arshdeep Singh

ఆ మ్యాచ్ నువ్వు ఆడలేదనే అనుకుని ట్రైయినింగ్ మొదలెట్టు. చేసిన తప్పు మరిచిపోవాలి, కానీ తప్పు ఎందుకు జరిగిందో కాదు. ఎక్కడ జరిగిందో తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టు. టీమిండియా మేనేజ్‌మెంట్, అతనికి అండగా ఉంటుందని నమ్ముతున్నా..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ...

click me!