అవకాశాలు రాకున్నా అదరగొట్టాడు, అశ్విన్ రియల్ సూపర్ స్టార్... కపిల్‌దేవ్ కామెంట్స్...

Published : Mar 08, 2022, 02:08 PM ISTUpdated : Mar 08, 2022, 02:09 PM IST

మొహాలీలో జరిగిన తొలి టెస్టు ద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్. 86 టెస్టుల్లో 435 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, టాప్ 10 హైయెస్ట్ వికెట్ టేకర్ల లిస్టులోకి ఎంట్రీ ఇచ్చాడు...

PREV
17
అవకాశాలు రాకున్నా అదరగొట్టాడు, అశ్విన్ రియల్ సూపర్ స్టార్...  కపిల్‌దేవ్ కామెంట్స్...

టీమిండియా తరుపున అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్‌లో ఉంటే, 435 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు...

27

టెస్టుల్లో ఐదు సెంచరీలు బాదిన రవిచంద్రన్ అశ్విన్, పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుంటున్నాడు... తన రికార్డును అధిగమించిన అశ్విన్‌ గురించి స్పందించాడు కపిల్‌ దేవ్...

37

‘కొన్నాళ్లుగా రవిచంద్రన్ అశ్విన్‌కి సరైన అవకాశాలు దక్కడం లేదు. ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగు టెస్టుల్లోనూ ఒక్క టెస్టు ఆడలేదు అశ్విన్...

47

అయినా 435 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, నా రికార్డును అధిగమించాడు. అయితే అశ్విన్ తర్వాతి ప్లేస్‌లో నేను ఉన్నానంటే అంగీకరించను...

57

ఎందుకంటే నా టైమ్ అయిపోయింది. ఒకే టైంలో ఇద్దరు ప్లేయర్లు ఆడితే, వారి మధ్య పోటీ ఉంటుంది. అశ్విన్ ఓ అద్భుతమైన టాలెంటెడ్ క్రికెటర్...
 

67

నాకు తెలిసి అశ్విన్ 500, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడానికే టార్గెట్ పెడతాడు. ఇంకొన్నిరోజులు ఆడితే అనిల్ కుంబ్లే రికార్డును కూడా అధిగమించగలడు...’ అంటూ అశ్విన్‌ని ప్రశంసల్లో ముంచెత్తాడు కపిల్ దేవ్...

77

కపిల్ దేవ్ వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘28 ఏళ్లకి ముందు కపిల్ దేవ్ ఆడుతుంటే, నేను ఉత్సాహంగా కేకులు వేసేవాడిని. ఈరోజు ఆయన రికార్డును అధిగమించడం సంతోషంగా ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్. 

click me!

Recommended Stories