సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. క్రికెట్ ఫీల్డ్‌లో ప్రత్యర్థుల్లా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి కొట్టుకునే ఈ ఇద్దరూ... ఆఫ్ ఫీల్డ్ మాత్రం ఆప్త మిత్రుల్లా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు...
24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన సచిన్ టెండూల్కర్‌కి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌లతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది...
210
Shane Warne vs Sachin Tendulkar
1998 భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు, ఇక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడింది... ముంబై వేదికగా మ్యాచులు ఆడింది.
310
Sachin Tendulkar-Shane Warne
ఆ సమయంలో షేన్ వార్న్‌ని తన ఇంటికి ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్, స్నేహితుడి కోసం స్వయంగా చికెన్ వండి పెట్టాడట...
410
shane warne
‘1998 సిరీస్ సమయంలో వార్న్‌ని నేను ఇంటికి డిన్నర్‌కి పిలిచాను. అతనికి ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టం...
510
sachin tendulkar
అందుకే నేనే స్వయంగా చికెన్ వండి పెట్టా. అయితే నేను వండిన చికెన్ కర్రీలో ఒకే ఒక్క ముక్క తిని, కారం భరించలేక తల్లడిల్లిపోయాడు...
610
Sachin- Shane warne
అయితే ఆ విషయం చెబితే నేను బాధపడతానని, నా మేనేజర్‌తో మెల్లిగా నసిగాడు. నాకు విషయం అర్థమైంది. చివరికి దాన్ని తినలేక అతనే కిచెన్‌కి వచ్చిన నచ్చినవి వండుకుని తిన్నాడు...’ అంటూ 24 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్...
710
shane warne
షేన్ వార్న్ కూడా సచిన్ టెండూల్కర్ గురించి తీసిన ఓ డాక్యుమెంటరీలో మాస్టర్ వండిన చికెన్ కర్నీ గురించి తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు...
810
Shane Warne
‘టెండూల్కర్ నాకు మంచి ఫ్రెండ్. ఓ సారి ముంబైలో ఉన్నప్పుడు, తన ఇంటికి డిన్నర్‌కి పిలిచాడు. సచిన్ టెండూల్కర్‌ని నేనే చికెన్ వండమని కోరాను...
910
Shane Warne-Sachin Tendulkar
అతను వండిన చికెన్ కర్రీలో ఒకే ఒక్క ముక్క తినేసరికి దిమ్మతిరిగిపోయింది. మంట... కారం... అయితే తను ఫీల్ అవుతాడని తింటున్నట్టే నటించాను...’ అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వార్న్...
1010
Shane Warne
షేన్ వార్న్ అకాలమరణంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన సచిన్... ‘దిగ్బ్రాంతికరమైన వార్త.. వార్నీ నిన్ను చాలా మిస్ అవుతాను. మైదానంలో, మైదానం వెలుపల నీతో ఎప్పుడూ నీరసంగా అనిపంచలేదు. మన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చర్యలు ఎల్లప్పుడూ విలువైనదిగా పరిగణిస్తాను.. భారత్ లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా..’అని ట్వీట్ చేశాడు.