శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయా... బెన్ స్టోక్స్‌ని ఫాలో అవుతున్న షకీబ్ అల్ హసన్...

Published : Mar 08, 2022, 12:10 PM IST

గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ముందు మెంటల్ హెల్త్ కోసం క్రికెట్‌ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ఇప్పుడు బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా అదే దారిని ఎంచుకున్నాడు...  

PREV
19
శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయా... బెన్ స్టోక్స్‌ని ఫాలో అవుతున్న షకీబ్ అల్ హసన్...

కరోనా విపత్తు తర్వాత బయో బబుల్ జోన్‌లో కట్టేసిన్నట్టు ఉండే వాతావరణంలో క్రికెట్ ఆడలేక శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ప్రెషర్‌కి లోనవుతున్నారు క్రికెటర్లు...

29

భారత క్రికెటర్లు గాయం పేరు చెప్పి, వరుస సిరీస్‌ల నుంచి బ్రేక్ తీసుకుంటుంటే... షకీబ్ అల్ హసన్, ‘క్రికెట్ ఆడే పొజిషన్‌లో లేను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు...

39

‘నేను ఇప్పటికే బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌తో ఈ విషయం గురించి మాట్లాడాను. నేను క్రికెట్‌ను ఎంజాయ్ చేయనప్పుడు, నా పర్ఫామెన్స్ ఎంత బాగున్నా వేస్టే...

49

నేను ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడకపోతే, నా టీమ్ మేట్స్‌ కూడా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న మెంటల్, ఫిజికల్ కండీషన్స్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేను...

59

నాకు బ్రేక్ కావాలి. కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా గడిపి, ఆటపై మరింత మక్కువతో, ఇంట్రెస్ట్‌తో తిరిగి వస్తాను... ఆఫ్ఘానిస్తాన్‌ సిరీస్‌లో అదే ఫీల్ అయ్యాను...

69

ఓ ప్యాసెంజర్‌లా వస్తున్నట్టు, పోతున్నట్టుగా అనిపించింది. టీ20, వన్డేలను ఎంజాయ్ చేయలేకపోతున్నా. నేను ఎలాగైనా ఆడాలని చాలా ప్రయత్నించాను.

79

ఇలాంటి మెంటల్ స్టేటస్‌తో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఈ మానసిక పరిస్థితిలో జట్టుతో కలిసి ఉంటే, మొదటికే మోసం రావచ్చు...

89

టెస్టుల నుంచి ఆరు నెలల బ్రేక్ తీసుకుంటున్నా. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ వరకూ టెస్టులు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నా. 

99

ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నా... ’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్ హసన్. 

click me!

Recommended Stories