రవిచంద్రన్ అశ్విన్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్సీ... అనిల్ కుంబ్లేలా మ్యాజిక్ చేస్తాడని ఆశపడుతున్న...

Published : Jun 30, 2022, 05:01 PM IST

విరాట్ కోహ్లీ ఏ నిమిషాన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో కాని, భారత జట్టు కెప్టెన్సీ సీటు మ్యూజికల్ ఛైర్స్ ఆటలా మారింది. ఇప్పటికే ఈ ఏడాదిలో రోహిత్, విరాట్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా రూపంలో ఐదుగురు కెప్టెన్లు మారగా,ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు కోసం మరో కెప్టెన్‌ని వెతుకుతోంది భారత జట్టు...

PREV
19
రవిచంద్రన్ అశ్విన్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్సీ... అనిల్ కుంబ్లేలా మ్యాజిక్ చేస్తాడని ఆశపడుతున్న...

ఐదో టెస్టు ఆరంభానికి ముందు కరోనా పాజిటివ్‌గా తేలిన రోహిత్ శర్మ, మ్యాచ్ సమయానికి కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారడంతో అతని స్థానంలో ఎవరు జట్టును లీడ్ చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది...

29

నిబంధనల ప్రకారం అయితే ఐదో టెస్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ దక్కాయి. అయితే భారత జట్టు చరిత్రలో ఇంతవరకూ పూర్తి స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ కెప్టెన్లుగా వ్యవహరించింది లేదు...

39

ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్లుగా కపిల్‌ దేవ్, హార్ధిక్ పాండ్యా టీమ్‌ని నడిపించారు. జస్ప్రిత్ బుమ్రాతో టీమిండియా కెప్టెన్సీ రేసులో మరో ఇద్దరు ప్లేయర్లు కూడా ఉన్నారట.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచనలోనూ టీమిండియా ఉందని సమాచారం...

49
Image credit: Twitter

అయితే రిషబ్ పంత్‌కి పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ వర్గాలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

59

వాస్తవానికి ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కారణం నలుగురు ఫాస్ట్ బౌలర్లను తుదిజట్టులోకి తీసుకున్న అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాని ఆడించాడు.. 

69

రెండో టెస్టు ఆడతానని, కాదు మూడో టెస్టు ఆడబోతున్నానంటూ... లేదు లేదు, ఈసారి కచ్ఛితంగా నాలుగో టెస్టులో ఉంటానని ఆశపడి, మీడియాకి చెబుతూ వచ్చిన రవిచంద్రన్ అశ్విన్... బ్యాటింగ్ ప్రాక్టీస్, బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం తప్ప ఒక్క టెస్టు కూడా ఆడలేదు...

79

సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 86 టెస్టులు ఆడి 5 సెంచరీలతో పాటు 442 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు.. 

89

రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టును టెస్టుల్లో కెప్టెన్‌గా నడిపించి సక్సెస్ అయ్యాడు అనిల్ కుంబ్లే. కుంబ్లే వారసుడిగా రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టును నడిపించడంలో విజయవంతం అవుతాడని బీసీసీఐలో ఓ వర్గం భావిస్తుందట...

99
Ravichandran Ashwin

జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్‌ల కంటే సుదీర్ఘమైన అంతర్జాతీయ అనుభవంతో పాటు దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా అనిల్ కుంబ్లే సొంతం. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి...

Read more Photos on
click me!

Recommended Stories