World Test Championship: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత కొంతకాలంగా రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే తాజాగా అతడు ప్రపంచంలో మరే ఇతర బౌలర్ సాధించని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రికార్డుల రారాజు రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్ లో కపిల్ దేవ్ తో పాటు డేల్ స్టెయిన్ (439 వికెట్లు) రికార్డులను బద్దలు కొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఇప్పుడు మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
28
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లంకపై రెండు టెస్టులలో 12 వికెట్లు తీయడంతో అశ్విన్.. డబ్ల్యూటీసీ టోర్నీలో వంద వికెట్లను తీసిన తొలి బౌలర్ గా రికార్డుల్లోకెక్కాడు.
38
డబ్ల్యూటీసీ లో భాగంగా రెండు (2019-2021, 2021-2023) సీజన్లుగా అశ్విన్ అద్భుత ప్రతిభతో వికెట్ల వేట సాగిస్తున్నాడు. మొత్తంగా ఈ రెండు సీజన్ల (రెండో సీజన్ కొనసాగుతున్నది) లో కలిపి 21 టెస్టులలో 100 వికెట్లు దక్కించుకున్నాడు.
48
తొలి సీజన్ (2019-21) సందర్భంగా అశ్విన్.. 14 టెస్టులలో 71 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రస్తుత సీజన్ లో భాగంగా.. 7 మ్యాచులలో 29 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా డబ్ల్యూటీసీ లో వంద వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా అవతరించాడు.
58
అశ్విన్ తర్వాత ఈ జాబితాలో పాట్ కమిన్స్ 20 టెస్టులలో 93 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత బ్రాడ్ (83), టిమ్ సౌథీ (80) ఉన్నారు. ఐదో స్థానంలో టీమిండియా పేస్ గుర్రం బుమ్రా (74) ఉన్నాడు. 70 వికెట్లతో షమీ ఏడో స్థానంలో నిలిచాడు.
68
ఇదిలాఉండగా.. డబ్ల్యూటీసీ లో భాగంగా ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. బుమ్రా.. 9 టెస్టులలో 40 వికెట్లు తీసుకున్నాడు.
78
ఈ జాబితాలో బుమ్రా తర్వాత షాహీన్ అఫ్రిది (32), రాబిన్సన్ (32), రబాడా (30) ఉన్నారు. తర్వాత స్థానాల్లో షమీ (8 టెస్టులలో 30 వికెట్లు), అశ్విన్ (7 టెస్టులలో 29 వికెట్లు) ఉన్నారు.
88
సోమవారం లంకతో ముగిసిన టెస్టు సిరీస్ లో 12 వికెట్లు తీయడంతో అశ్విన్.. టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అశ్విన్.. 86 టెస్టులలో 442 వికెట్లు పడగొట్టాడు.