Published : Mar 15, 2022, 03:35 PM ISTUpdated : Mar 15, 2022, 03:36 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్‌లో మరో లెజెండరీ ప్లేయర్ చేరాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్..
2016లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న షేన్ వాట్సన్, ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...
29
ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన షేన్ వాట్సన్, లీగ్ చరిత్రలో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు...
39
రాజస్థాన్ రాయల్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన షేన్ వాట్సన్, 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి, ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు..
49
2018 ఐపీఎల్ ఫైనల్‌లో సెంచరీ చేసిన షేన్ వాట్సన్, 2019 ఫైనల్ మ్యాచ్‌లో 80 పరుగులు చేసి సీఎస్‌కే తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు... ఈ మ్యాచ్‌లో మోకాలికి గాయమై, రక్తం కారుతున్నా బ్యాటింగ్ కొనసాగించి, క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు వాట్సన్...
59
మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎంతో ఆత్మీయ మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న షేన్ వాట్సన్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
69
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఎన్నో మ్యాచులు ఆడిన షేన్ వాట్సన్, ఇప్పుడు అతనితో కలిసి పని చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు కామెంట్ చేశాడు...
79
‘ఐపీఎల్ 2022 సీజన్ కోసం త్వరలో ఇండియాకి వెళ్లబోతున్నా. వరల్డ్‌లో ది బెస్ట్ టీ20 టోర్నీ ఐపీఎల్‌లో, రికీ పాంటింగ్‌తో కూడా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్...
89
కొన్నిరోజుల కింద ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ, రాజస్థాన్ రాయల్స్‌కి బౌలింగ్ కోచ్‌గా ఎంపికకావడంతో అవాక్కైన క్రికెట్ ఫ్యాన్స్, ఇప్పుడు షేన్ వాట్సన్, సీఎస్‌కే ఝలక్ ఇచ్చాడని అంటున్నారు...
99
ముంబై ఇండియన్స్‌కి 12 సీజన్లు ఆడిన లసిత్ మలింగను రాజస్థాన్ రాయల్స్‌కి తీసుకురావడంతో ఆ టీమ్ హెడ్ కోచ్ కుమార సంగర్కర కీ రోల్ పోషిస్తే, ఇప్పుడు షేన్ వాట్సన్, ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరడానికి రికీ పాంటింగ్ చక్రం తిప్పాడు...