అక్కడ కోటిన్నరకి ఆడుతూ, ఇక్కడ రూ.12 కోట్లు ఇచ్చినా వద్దన్న రషీద్ ఖాన్.. ఐపీఎల్‌కీ, పీఎస్‌ఎల్‌కీ అంత తేడా...

First Published Dec 24, 2021, 10:58 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ తర్వాత ప్రతీ దేశంలోనూ ఓ టీ20 లీగ్ పుట్టుకొచ్చింది. అయితే ఎన్ని లీగులు వచ్చినా ఐపీఎల్ క్రేజ్, రేంజ్ మాత్రం వేరు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడిన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టు మారాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే...

ఐపీఎల్ 2017 వేలంలో రషీద్ ఖాన్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అప్పటి నుంచి నాలుగేళ్లుగా ఈ ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్‌ను రిటైన్ చేసుకుంటూ వస్తోంది. 

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కేన్ విలియంసన్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, అతనితో పాటు ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకుంది...

రషీద్ ఖాన్‌ను రెండో రిటెన్షన్‌గా రూ.12 కోట్లకు రిటైన్ చేసుకోవాలని భావించింది సన్‌రైజర్స్. అయితే రూ.15 కోట్లకు మొదటి రిటెన్షన్ కావాలని డిమాండ్ చేశాడట రషీద్ ఖాన్...

కెప్టెన్ కేన్ విలియంసన్ కంటే రషీద్ ఖాన్‌కి ఎక్కువ చెల్లించడం భావ్యం కాదని, రషీద్ ఖాన్‌ను వేలానికి విడుదల చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్...

అయితే పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు రషీద్ ఖాన్. ఈ టీమ్‌కి ఆడుతున్నందుకు రషీద్ ఖాన్ అందుకుంటున్న మొత్తం కేవలం రూ.1.27 కోట్లు మాత్రమే...

అక్కడ సరిగా కోటిన్నర కూడా తీసుకోకుండా ఆడుతున్న రషీద్ ఖాన్, ఐపీఎల్‌లో రూ.12 కోట్లు ఇస్తామని చెప్పినా రిటైన్ అవ్వడానికి ఇష్టపడకపోవడం విశేషం...

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి రూ.20 కోట్లు ఆఫర్ చేసిన లక్నో ఫ్రాంఛైజీ, రషీద్ ఖాన్ కోసం రూ.16 కోట్లు చెల్లించడానికి సిద్ధమైందని సమాచారం...

ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికే ఒక్కో ప్లేయర్‌కి రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

ఐపీఎల్ కంటే మా లీగే గొప్ప అని బడాయిలు పోయే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మొదటి ప్రాధాన్యత రిటెన్షన్‌‌‌కి రూ.3 కోట్లు మాత్రమే చెల్లిస్తుండడం కొసమెరుపు... 

click me!