Ranji Trophy 2024: సెంచ‌రీతో రెచ్చిపోయిన తిల‌క్ వ‌ర్మ‌.. రంజీ ట్రోఫీలో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ !

First Published | Jan 5, 2024, 4:39 PM IST

Tilak Varma slams century: తిల‌క్ వ‌ర్మ రంజీ ట్రోపీ 2024లో త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో సెంచ‌రీ కొట్టాడు. దేశ‌వాళీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది త‌న రెండో సెంచ‌రీ. నాగాలాండ్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో బ్యాట‌ర్లు రాణించ‌డంతో హైద‌రాబాద్ త‌న తొలి ఇన్నింగ్స్ ను 474/5 ప‌రుగుల‌కు డిక్లేర్ చేసింది.   
 

Tilak Varma, Ranji Trophy 2024

Ranji Trophy 2024 - Tilak Varma: గత సీజన్ లో వరుస పేలవ ప్రదర్శనలతో ప్లేట్ గ్రూప్ లో చోటు దక్కించుకున్న హైదరాబాద్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ 2024 లో రాణించాల‌ని చూస్తోంది. తిల‌క్ వ‌ర్మ నాయ‌క‌త్వంలోని హైద‌రాబాద్ టీ శుక్రవారం ప్రారంభ‌మైన రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ లో నాగాలాండ్ తో దిమాపూర్ లో తలపడుతోంది. తొలి మ్యాచ్ లో హైద‌రాబాద్ కెప్టెన్ ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 112 బంతుల్లో 100 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. 

నాగాలాండ్ క్రికెట్ స్టేడియంలో నాగాలాండ్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ త‌న అద్భుత బ్యాటింత్ తో సెంచరీ సాధించి తన 2024 రంజీ ట్రోఫీ క్రీడ‌ను గ్రాండ్ గా ప్రారంభించాడు. 112 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న తిల‌క్ వర్మకు ఇది రెండో ఫస్ట్ క్లాస్ సెంచరీ కావడం విశేషం. 
 

Latest Videos


తిల‌వ్ వ‌ర్మ త‌న సెంచరీ ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, ఆరు బౌండరీలు సాధించి ట్రిపుల్ ఫిగర్ మార్కును చేరుకున్నాడు. తిల‌వ్ వ‌ర్మ‌తో పాటు మిగ‌తా బ్యాట‌ర్స్ రాణించ‌డంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ లో 474/5 పరుగులు చేసింది. 
 

2018 డిసెంబర్ లో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వర్మ.. అయితే ఇటీవల భార‌త జ‌ట్టులోకి వ‌చ్చి కీల‌క ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో 21 ఏళ్ల యంగ్ ప్లేయ‌ర్ హైద‌రాబాద్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు. 
 

తిల‌క్ వ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తంగా 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 38కి పైగా సగటుతో 673 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ లో రెండు సెంచరీలతో పాటు మూడు అర్ధశతకాలు కూడా సాధించాడు. 2023లో భారత్ తరఫున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు తిల‌క్ వ‌ర్మ‌. 
 

click me!