IND vs SA: చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి

First Published | Jan 5, 2024, 1:30 PM IST

India vs South Africa Test: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ విజ‌యం సాధించిన టీమిండియా అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. కేప్ టౌన్ లో గెల‌వ‌డం ఇదే తొలిసారి. అలాగే, అతిత‌క్కువ బంతుల్లోనే టెస్టు ఫ‌లితం తేల‌డం 147 ఏండ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. 
 

India , Cricket,

India vs South Africa Test:  కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి చ‌రిత్ర సృష్టించింది. రెండో టెస్టు గెలుపుతో అరుదైన రికార్డును న‌మోదుచేసింది.

భార‌త్-ద‌క్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ ఫ‌లితం త‌క్కువ బంతుల్లోనే వ‌చ్చింది. 642 బంతుల్లోనే టెస్టు ఫ‌లితం తేల‌డం 147 ఏండ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. 1932లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నెలకొల్పిన 656 బంతుల మైలురాయిని అందుకోవడంతో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేవలం 642 బంతులు మాత్రమే సాగింది.


భార‌త్-సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ ల త‌ర్వాత‌, 672 బంతుల్లో వెస్టిండీస్-ఇంగ్లాండ్ టెస్టు, 788 బంతుల్లో ఇంగ్లాండ్-ఆసీస్ టెస్టు మ్యాచ్ ఫ‌లితాలు వ‌చ్చాయి. 

South Africa vs India

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టులో బౌల‌ర్ల హ‌వా కొన‌సాగింది. న్యూలాండ్స్ లో తొలి రోజు భారత్ తో ప్రారంభమైన రెండు రోజులూ బౌలర్లదే పైచేయి. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్ లో55, రెండో ఇన్నింగ్స్ 176  ప‌రుగుల‌కే కూప్ప‌కూలింది.

ఇక భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 153 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 79 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ గెల‌వ‌ని కేప్ టౌన్ వేదిక టెస్టులో విజ‌యం సాధించింది.

Latest Videos

click me!