ఇంటర్న్ షిప్ లోనే ల‌క్ష‌ల జీతం.. ఫైనాన్స్ రంగంలోకి సౌరవ్ గంగూలీ కూతురు సనా

First Published | Jan 5, 2024, 11:59 AM IST

Ganguly Daughter Sana: భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఇంటర్న్ షిప్ లోనే  భారీ జీతం అందుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచారు సనా గంగూలీ.
 

Sana Ganguly

Sana Ganguly Salary: తండ్రి సౌరవ్ గంగూలీ దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలగా, ఆయన కుమార్తె ఇప్పుడు ఆర్థిక ప్రపంచాన్ని శాసించే దిశగా తొలి అడుగు వేసింది. సనా గంగూలీ ఇప్పుడు ఇంటర్న్ షిప్ లోనే భారీ వేతనంతో ఉద్యోగం సాధించింది. 

Sana Ganguly

కోల్ క‌తాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసిన సనా గంగూలీ లండన్ లోని యూసీఎల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన స‌నాకు ఇప్పుడు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
 


స్కూల్ డేస్ లో తెలివైన స్టూడెంట్ అయిన సనా గంగూలీ యూసీఎల్ కాలేజీలో చదువుకుంటూనే హెచ్ ఎస్ బీసీ, గోల్డ్ మన్ శాక్స్ వంటి బహుళజాతి కంపెనీలతో ఇంటర్న్ షిప్ లు చేయడం ద్వారా కొత్త ఛాలెంజ్ కు సిద్ధమైంది.

సనా గంగూలీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్స్ కన్సల్టింగ్ కంపెనీ అయిన పీడబ్ల్యూసీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. అయితే, ఇంటర్న్ షిప్ లోనే స‌నా భారీగా రెమ్యునరేషన్ అంతుకుంటోంది.

సనా గంగూలీ ఇంటర్న్ షిప్ జీతం గురించిన వివ‌రాలు వింటే మీరు షాక్ అవుతారు. సనాకు లక్షల్లో పారితోషికం ఇస్తున్నారు. పీడబ్ల్యూసీలో పనిచేసే వారికి రూ.30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. ప్ర‌స్తుతం నెల‌కు ల‌క్ష రూపాయ‌ల జీతం అందుకుంటోందని స‌మాచారం. 

ఒకప్పుడు డాన్స్ క్వీన్ గా వెలుగొందిన సనా గంగూలీ ఇప్పుడు ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టిందని, ఈ కొత్త జెర్సీలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని దాదా అభిమానులు కోరుకుంటున్నారు.

Latest Videos

click me!