హైదరాబాద్‌పై డబుల్ సెంచరీ బాదిన అజింకా రహానే... టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలడా...

Published : Dec 21, 2022, 01:55 PM IST

టీమిండియాకి  విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు అజింకా రహానే. అయితే రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయాడు. విరాట్‌తో పాటు అజింకా రహానే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయి, ఆ తర్వాత టీమ్‌లోనే ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది...

PREV
16
హైదరాబాద్‌పై డబుల్ సెంచరీ బాదిన అజింకా రహానే... టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగలడా...

ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేశాడు. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో గెలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత జట్టు. సెంచరీతో టీమ్‌ని ముందుండి నడిపించాడు అజింకా రహానే..

 

26

మెల్‌బోర్న్ టెస్టు తర్వాత సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో చారిత్రక డ్రా చేసుకున్న టీమిండియా... గబ్బాలో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకి ఓటమి రుచి చూపించింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ తర్వాత రహానే ప్రభవం తగ్గుతూ వచ్చింది...

 

36

ఫామ్‌ కోల్పోయి పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిన అజింకా రహానే, ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్ తర్వాత టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు. రహానేతో పాటు టీమ్‌‌కి దూరమైన ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఫామ్ నిరూపించుకుని రీఎంట్రీ ఇచ్చి సెంచరీ కూడా బాదాడు. అజింకా రహానే మాత్రం ఇంకా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు..

46

తాజాగా రంజీ ట్రోఫీ 2022 టోర్నీలో హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు అజింకా రహానే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 127.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 651 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది..

56

పృథ్వీ షా 19 పరుగులు చేసి అవుట్ కాగా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 195 బంతుల్లో 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 162 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 80 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 పరుగులు చేసి సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు...

66

కెప్టెన్ అజింకా రహానే 261 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సర్లతో 204 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రంజీల్లో రికార్డు లెవెల్లో పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్, మరో సెంచరీ బాదేశాడు. 126 పరుగులు చేసి సర్ఫరాజ్ ఖాన్.. నాటౌట్‌గా నిలవగా హార్థిక్ తామోర్ 9, షామ్స్ ములానీ 23 పరుగులు చేశారు..
.  

click me!

Recommended Stories