రికీ పాంటింగ్ కంటే ధోనీ బెస్ట్ కెప్టెన్! ఎందుకంటే ఇండియాలో రాజకీయాలు ఎక్కువ... బ్రాడ్ హాగ్ కామెంట్..

First Published Dec 21, 2022, 1:25 PM IST

క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్‌. రెండు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన రికీ పాంటింగ్, రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా గెలిచాడు. పాంటింగ్ తర్వాత మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ సారథిగా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ..

మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్‌లలో ఎవరు గొప్ప కెప్టెన్ అంటే... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పేరే చెబుతారు చాలామంది. ఎందుకంటే రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని డామినేషన్ చూపించింది.

ఐసీసీ టోర్నీలు కాదు కదా, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీసులు ఆడాలంటేనే భయపడేవాళ్లు మిగిలిన జట్ల ప్లేయర్లు... దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా ఆధిపత్యానికి చెక్ పెట్టింది మాహీ కెప్టెన్సీలని టీమిండియానే. ధోనీ కెప్టెన్సీలో అండర్ డాగ్స్‌గా బరిలో దిగి 2007 టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన టీమిండియా, 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ని కూడా సొంతం చేసుకుంది...

Ricky Ponting (Australia)

రికీ పాంటింగ్ కంటే మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప కెప్టెన్‌గా ఓ మెట్టు పైనే ఉంటాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్... ధోనీ ఎన్నో రాజకీయాలను తట్టుకుని, నిలబడి టీమ్‌కి మూడు టైటిల్స్ అందించగలిగాడని కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...

‘రికీ పాంటింగ్‌కి ఓ అద్భుతమైన టీమ్ దొరికింది. మాథ్యూ హేడెన్, షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్ లీ.. ఇలా పాంటింగ్ టీమ్‌లో ప్రతీ ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నరే. అలాగే మహేంద్ర సింగ్ ధోనీకి చాలా గొప్ప టీమ్ ఉండేది..

సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా ధోనీ టీమ్‌లో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉండేవాళ్లు. ఏ ప్లేయర్‌ని ఎలా వాడాలో మహేంద్ర సింగ్ ధోనీకి బాగా తెలుసు. అదే అతని సక్సెస్ సీక్రెట్...

ricky ponting

అయితే రికీ పాంటింగ్‌తో పోలిస్తే ధోనీయే గొప్ప కెప్టెన్ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే భారత క్రికెట్‌లో రాజకీయాలు ఎక్కువ. భారత్‌లాంటి దేశంలో క్రికెట్‌ టీమ్‌ని నడిపించాలంటే ఎన్నో ఆటంకాలను, ఒత్తుడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ దాటుకుని టీమిండియాని జగజ్జేతగా నిలిచాడు ధోనీ...

Ricky Ponting

రికీ పాంటింగ్‌కి అంత అవసరం ఎప్పుడూ రాలేదు. అతని చుట్టూ ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్లు ఎప్పుడూ తోడుగా నిలిచారు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌లో రాజకీయాలు ఉండవు, ఉన్నా కెప్టెన్‌పై ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకుంటారు.. రికీ పాంటింగ్ కేవలం ఆటను మాత్రమే చూసుకునేవాడు...

ప్లేయర్ల యాటిట్యూడ్ గురించి, వారి ప్రవర్తన గురించి రికీ పాంటింగ్‌కి బాగా తెలుసు. అలాగే ప్లేయర్ల బలాబలాలు కూడా అంచనా వేసేవాడు. మాహీకి కూడా ఇవన్నీ తెలుసు. అయితే ఫలానా ప్లేయర్‌నే ఆడించాలనే రాజకీయ ఒత్తుడులు కూడా ఉండేవి. వాటిని దాటి టైటిల్ గెలవడం మామూలు విషయం కాదు... అందుకే రికీ కంటే ధోనీ గొప్ప కెప్టెన్’ అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.. 

click me!