రమీజ్ ఎప్పుడూ స్లిప్స్‌లోనే.. పట్టిన క్యాచ్‌ల కంటే వదిలేసినవే ఎక్కువ.. పీసీబీ చీఫ్‌పై బాంబు పేల్చిన అక్రమ్

Published : Nov 29, 2022, 04:52 PM IST

 Wasim Akram: సోమవారం పాకిస్తాన్  మాజీ సారథి సలీమ్ మాలిక్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అక్రమ్.. ఇప్పుడు  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా మీద బాంబు పేల్చాడు. 

PREV
18
రమీజ్ ఎప్పుడూ స్లిప్స్‌లోనే.. పట్టిన క్యాచ్‌ల కంటే వదిలేసినవే ఎక్కువ.. పీసీబీ చీఫ్‌పై బాంబు పేల్చిన అక్రమ్

తన కొత్త పుస్తకం ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ లో సంచలన  విషయాలు వెల్లడిస్తున్న  వసీం అక్రమ్ మరో బాంబు పేల్చాడు. సోమవారం పాకిస్తాన్  మాజీ సారథి సలీమ్ మాలిక్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అక్రమ్.. ఇప్పుడు  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా మీద బాంబు పేల్చాడు. 

28

రమీజ్ రాజా ఎప్పుడూ స్లిప్స్ లోనే ఫీల్డింగ్ చేసేవాడని..   అతడు పట్టిన క్యాచ్ ల కంటే నేలపాలు చేసినవే ఎక్కువని  అక్రమ్ తన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.  న్యూజిలాండ్ తో ఓ టెస్టు  మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ  అక్రమ్ ఈ కామెంట్స్ చేశాడు. 
 

38

‘న్యూజిలాండ్ తో టెస్టులో భాగంగా అసిఫ్ ఫరీది  తొలి ఓవర్ వేశాడు. నేను  రెండో ఓవర్ వేశాను.  జాన్ రైట్  (న్యూజిలాండ్ కెప్టెన్)  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను నాలుగో  ఓవర్ విసిరాను. ఆ ఓవర్లో రైట్ ఇచ్చిన క్యాచ్ ను సెకండ్ స్లిప్స్ లో ఉన్న రమీజ్ నేలపాలు చేశాడు.

48

తన బ్యాటింగ్ స్కిల్స్ తో  రమీజ్ ఎప్పుడూ స్లిప్స్ లోనే ఉండేవాడు. ఎందుకంటే రమీజ్ తండ్రి  కమిషనర్. అంతేగాక అతడు అయిచిసన్ కాలేజ్ లో చదివాడు. వాస్తవానికి చెప్పాలంటే  రమీజ్ పట్టుకున్న క్యాచ్ ల కంటే  జారవిడిచిన క్యాచ్ లే ఎక్కువ..’ అని రాసుకొచ్చాడు.  

58

రమీజ్ రాజా తండ్రి  రాజా సలీమ్ అక్తర్ పాకిస్తాన్ లో సివిల్ సర్వెంట్ గా పనిచేశారు. అంతేగాక ఆయన క్రికెటర్ కూడా.  ముల్తాన్, సర్దోగ జట్ల తరఫున పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయనకు ఇద్దరు కొడుకులు.  వసీం రాజా, రమీజ్ రాజా. రమీజ్ జాతీయ జట్టుకు ఆడగా వసీం  దేశవాళీలో రాణించాడు. సలీమ్ అక్తర్ రాజా 2004లో తన 74 ఏండ్ల వయసులో మరణించారు. 

68

రమీజ్ - అక్రమ్ దాదాపు ఒకే సమయంలో  పాకిస్తాన్ క్రికెట్ కు ఎంట్రీ ఇచ్చారు. 1985 నుంచి 1997 వరకూ ఇద్దరూ కలిసి పాకిస్తాన్ తరఫున సుమారు 188  మ్యాచ్ లలో ప్రాతినిథ్యం వహించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. మరి అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ చీఫ్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. 

78

ఇక అక్రమ్ తన పుస్తకంలో.. ‘తన కంటే రెండేండ్లు జూనియర్ అయినందుకు అతడు ఆ అడ్వంటేజీని తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు.  సెల్ఫిష్. ఎప్పుడూ  నన్ను తనకు ఓ పనోడిలా భావించేవాడు. తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు,  బూట్లను ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది..’ అంటూ మాజీ సారథి సలీమ్ మాలిక్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

88

దీనికి సలీమ్ మాలిక్ కౌంటర్ గా..  ‘అక్రమ్ చేసిన కామెంట్స్ పై నేను అతడితో మాట్లాడదామని ఫోన్ చేశాను. కానీ నా ఫోన్ ఎత్తలేదు. పాకిస్తాన్ జట్టు తరఫున మేం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ వాషింగ్ మిషన్స్ ఉండేవి. మేం మా చేతులతో ఉతికే అవసరమే రాలేదు. మరి  అక్రమ్ నా బట్టలు ఎప్పుడు ఉతికాడు..? నేను నిజంగా సెల్ఫిష్ అయ్యుంటే నా సారథ్యంలోనే కదా అతడు  ఆడింది. తన తొలి మ్యాచ్ ను కూడా నా నాయకత్వంలోనే  ఆడాడు.  నేను నిజంగా స్వార్థపరుడిని అయితే అక్రమ్ కు బౌలింగ్ ఎందుకిస్తా..? బట్టలు ఉతకడం,  మసాజ్ చేయడం వంటి పనికిమాలిన కామెంట్స్ చేసి అక్రమ్ తనను తానే తక్కువ చేసుకున్నాడు.  అక్రమ్ తన  పుస్తకంలో ఏ సెన్స్ లో  ఈ  రాతలు రాసుుకొచ్చాడో  అతడికే తెలియాలి..’ అని  కౌంటర్ ఇచ్చాడు. 
 

click me!

Recommended Stories