చాహల్‌ను కూలోడిని చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా సారథే సాక్ష్యం..

Published : Nov 29, 2022, 02:50 PM IST

INDvsNZ : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు బుధవారం  కివీస్ తో కీలకమైన మూడో వన్డే ఆడాల్సి ఉంది. ఈ వన్డే కోసం ఇరుజట్లు ఇప్పటికే క్రిస్ట్‌చర్చ్ కు చేరుకున్నాయి. 

PREV
16
చాహల్‌ను కూలోడిని చేసిన ధనశ్రీ వర్మ..  టీమిండియా  సారథే సాక్ష్యం..

పెళ్లయ్యాక జీవితం  గతంలా ఉండదు. ముఖ్యంగా మగవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. లెక్కకు మించిన బరువు, బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. భార్యల ఆధిపత్యం ఉండే ఇండ్లలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఏ షాపింగ్ కో, టూర్ కో వెళ్తే  సందడంతా భార్యది.. బరువు మోయాల్సింది భర్తనే.. 

26

సామాన్యుల దగ్గర్నుంచి  సెలబ్రిటీల వరకూ ఈ తిప్పలు తప్పవు.  ఏ స్థాయిలో ఉన్నా.. మగవాడు కాంతదాసుడే. అదేదో సినిమా కవి చెప్పినట్టు.. ‘కోడెనాగులాంటి వాన్ని వానపాము చేసింది. ఆలి కాదురా అది భద్రకాళి..’ అని పాటలు పాడుకోవడమే భర్తల చేతిలో ఉంది.  
 

36

తాజాగా టీమిండియా  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఇదే పాట పాడుకుంటున్నాడు.  తన భార్య ధనశ్రీ వర్మ.. చాహల్ ను కూలీ చేసేసింది. తన వస్తువులన్నీ మోపిస్తున్నది. న్యూజిలాండ్  పర్యటనకు వెళ్లిన టీమిండియా  జట్టులో ఉన్న  చాహల్.. టీమ్ బాధ్యతలతో పాటు లగేజ్ బరువు కూడా మోయాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా  టీమిండియా  తాత్కాలిక సారథి శిఖర్ ధావనే వెల్లడించాడు.  

46

క్రిస్ట్‌చర్చ్ వేదికగా మూడో వన్డేలో ఆడేందుకు భారత జట్టు ఆటగాళ్లు సోమవారం అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న తరుణంలో చాహల్.. తన రెండు చేతులతో బరువుగా ఉన్న  రెండు లగేజీ  బ్యాగులను మోసుకువచ్చాడు. రెండు చేతులతోనే గాక  వీపు, పొట్ట మీద రెండు బ్యాగులను వేసుకుని వచ్చాడు. కానీ వెనకాల  వచ్చిన ధనశ్రీ మాత్రం..  స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. 

56

ఇందుకు సంబంధించిన వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేశాడు. ధావన్ ఈ వీడియోను అభిమానులతో పంచుకుంటూ.. ‘చూడండి చాహల్ ను ధనశ్రీ కూలీని చేసింది.. అయ్యో యుజీ.. నీకెన్ని కష్టాలు..’ అని  సరదాగా వ్యాఖ్యానించాడు. 

66

 వెనకాలే వస్తున్న ధనశ్రీతో దీనిపై నువ్వేం చెబుతావు..? అని ప్రశ్నించగా.. ‘స్ట్రాంగ్ ఉండాలంటే ఆ మాత్రం మోయొద్దా..’ అని నవ్వుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

click me!

Recommended Stories