18 ఏళ్లకే తండ్రిని కోల్పోవడం, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని నేరుగా రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడం, కెప్టెన్‌గా 2008 అండర్ 19 వరల్డ్ కప్ విజయం, అదే ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకోవడం...
టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్‌తో టీమ్‌లో చోటు కోల్పోవడం, అదిరిపోయే కమ్‌బ్యాక్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, టీమిండియా వైస్ కెప్టెన్సీ, టెస్టు కెప్టెన్సీ, 2014 ఇంగ్లాండ్ టూర్‌లో అట్టర్ ఫ్లాప్, ఆ తర్వాతి టూర్‌లో సెంచరీల మోత, లవ్ ఎఫైర్స్, అనుష్క శర్మతో ప్రేమ, పెళ్లి..
మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా రికార్డు, అగ్రెసివ్ యాటిట్యూడ్, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవ,కెప్టెన్సీ కోల్పోవడం... ఫామ్ కోల్పోయి మూడేళ్లు సెంచరీ లేకుండా గడిపేయడం, టీమ్‌లో చోటు ఇవ్వడమే దండగ అనే విమర్శలు...
Virat Kohli
ఛేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చేసిన కుట్ర బయటపడడం, ఆసియా కప్ 2022 సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం.. ఇలా విరాట్ కోహ్లీ జీవితం ఓ మాస్ మసాలా సినిమాకి తగ్గకుండా ఉంటుంది. ధోనీ బయోపిక్ సూపర్ హిట్ కావడంతో విరాట్ కోహ్లీ జీవితంతో బయోపిక్ తెచ్చేందుకు బాలీవుడ్ ప్రయత్నాలు మొదలెట్టింది..
విరాట్ కోహ్లీ పాత్రలో నటించడానికి చాలామంది బాలీవుడ్ హీరోలు సిద్దంగా ఉన్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..
ఈ ఏడాది మార్చిలోనే విరాట్ కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని, ఆయన బయోపిక్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నానంటూ ప్రకటించాడు రామ్ చరణ్. అయితే కోహ్లీ బయోపిక్ రైట్స్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు...
ధోనీ తన బయోపిక్ రైట్స్‌ని రూ.100 కోట్లకు అమ్మేశాడు. విరాట్ కోహ్లీ ఒక్క సోషల్ మీడియా పోస్టు ద్వారా రూ.8 కోట్ల దాకా అందుకుంటున్నాడు. ధోనీతో పోలిస్తే విరాట్ కోహ్లీ క్రేజ్ వరల్డ్ వైడ్ ఉంది. కాబట్టి తన బయోపిక్ రైట్స్ కోసం విరాట్ కోహ్లీ రూ.800-రూ.1000 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..
సరిగ్గా తీస్తే, ఈ డబ్బుని రికవరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే విరాట్ కోహ్లీకి అడిగినంత ముట్టచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు. అయితే ఇవన్నీ ఉట్టి వార్తలని, విరాట్ కోహ్లీ ఇంకా బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా సోషల్ మీడిాయలో వార్తలు వస్తున్నాయి.
2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ని క్లైమాక్స్‌గా ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్..
ఒకవేళ 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం సాధిస్తే, అది కూడా విరాట్ కోహ్లీ బయోపిక్ క్లైమాక్స్‌లో భాగం అవుతుంది. అయితే తన బయోపిక్‌లో తానే నటిస్తానని సరదాగా కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ, తన పాత్రలో నటించడానికి రామ్ చరణ్‌కి ఏదైనా ట్రైయినింగ్ ఇస్తాడేమో చూడాలి..