నేను క్రికెటర్ అయినందుకు సిగ్గుపడుతున్నా! గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

Chinthakindhi Ramu | Published : Sep 6, 2023 8:44 PM
Google News Follow Us

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా రెండు వరల్డ్ కప్స్ గెలిచింది. అయితే ఈ రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం గౌతమ్ గంభీర్..
 

18
నేను క్రికెటర్ అయినందుకు సిగ్గుపడుతున్నా! గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేసి, టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు గౌతమ్ గంభీర్. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో సెహ్వాగ్, సచిన్ వికెట్లు త్వరగా కోల్పోయిన సమయంలో 122 బంతుల్లో 97 పరుగులు చేశాడు గౌతమ్ గంభీర్..

28

13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతమ్ గంభీర్, మొత్తంగా 10 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..

38

కొన్ని మ్యాచులకు టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడు. కేకేఆర్ కెప్టెన్‌గా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు గంభీర్..

Related Articles

48

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి, భారతీయ జనతా పార్టీ తరుపున ఢిల్లీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు గౌతమ్ గంభీర్. 
 

58

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా, అంతర్జాతీయ మ్యాచులకు కామెంటేటర్‌గా  వ్యవహరిస్తున్న గంభీర్... సంచలన వ్యాఖ్యలు చేశాడు..

68

‘నా జీవితంలో నేను సిగ్గుపడే విషయం ఏంటంటే అది క్రికెటర్‌‌‌ కావడమే...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్... టీమిండియా మ్యాచ్ విన్నర్లలో ఒకడైన గంభీర్, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..

78
Gautam Gambhir

టీమిండియాకి రెండు వరల్డ్ కప్స్ అందించడంలో కీలక పాత్ర పోషించినప్పుడు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, గంభీర్‌ని హేట్ చేస్తారు. ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్‌కి గౌతమ్ గంభీర్ అంటే అస్సలు పడదు... ఈ కారణంగానే గంభీర్ ఇలా ఫీల్ అవుతూ ఉండవచ్చని అంటున్నారు కొందరు నెటిజన్లు..

88

గౌతమ్ గంభీర్ పక్కా పొలిటీషన్ మెటీరియల్ అని, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి, క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించినందుకు ఫీల్ అవుతూ ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు.. గంభీర్, ఇంతలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటనేది అతను చెప్పేదాకా తెలీదు.. 

Recommended Photos