క్రీడాకారులు, సినిమావాళ్లు రాజకీయాలకు పనికి రారు! కేవలం ఇగో కోసమే... వీరేంద్ర సెహ్వాగ్‌ కామెంట్స్

Chinthakindhi Ramu | Published : Sep 6, 2023 6:06 PM
Google News Follow Us

సచిన్ టెండూల్కర్ తర్వాత గౌతమ్ గంభీర్‌తోనే ఎక్కువ మ్యాచుల్లో ఓపెనింగ్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఇద్దరూ దాదాపు 10 ఏళ్లు కలిసి ఆడారు.. అయితే ఇద్దరు ఢిల్లీ ప్లేయర్లకు ఎప్పుడూ పడనట్టే, ఈ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి పడదు.. 
 

110
క్రీడాకారులు, సినిమావాళ్లు రాజకీయాలకు పనికి రారు! కేవలం ఇగో కోసమే... వీరేంద్ర సెహ్వాగ్‌ కామెంట్స్

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలు గెలిచిన భారత జట్టుల్లో సభ్యులుగా ఉన్న అతి కొద్ది మంది ప్లేయర్లలో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ కూడా ఉంటారు. అయితే ఈ ఇద్దరికీ చాలా రోజులుగా అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం..

210

కొన్నిరోజుల కిందట వీరేంద్ర సెహ్వాగ్ ఓ పాన్ మసాలా యాడ్‌లో కనిపించాడు. వీరూతో పాటు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి లెజెండరీ భారత క్రికెటర్లు కూడా ఆ పాన్ మసాలా యాడ్‌లో కనిపించారు..
 

310
Sehwag-Gambhir

దీనిపై గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ‘ఇంత గొప్ప క్రికెటర్లుగా ఉండి ఏం లాభం? కేవలం డబ్బుల కోసం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే పాన్ మసాలా యాడ్‌లో నటిస్తారా? అందుకే నేను ఎప్పుడు రోల్ మోడల్ ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతా. సచిన్ టెండూల్కర్ రూ.20 కోట్లు ఇచ్చినా సిగరెట్, ఆల్కహాల్ యాడ్ చేయనని చెప్పాడు. ఆయనే నా రోల్ మోడల్...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్..
 

Related Articles

410
Image credit: Getty

ఈ వ్యాఖ్యలపై కపిల్ కానీ, గవాస్కర్ కానీ, వీరూ కానీ స్పందించలేదు. అయితే తాజాగా ఇండియా పేరుని భారత్‌గా మార్చాలని సమర్ధిస్తూ వస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ పనిలో పనిగా గౌతమ్ గంభీర్‌కి కౌంటర్ ఇచ్చాడు..

510

వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్ ఖాతాలో ఓ అభిమాని, ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే గౌతమ్ గంభీర్ కంటే ముందే ఎంపీ అయ్యేవారు’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు వీరూ..

610
Virender Sehwag

‘నాకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదు. గత రెండు ఎలక్షన్లలో రెండు మేజర్ పార్టీలు నా దగ్గరికి వచ్చాయి. నా ఉద్దేశంలో సినిమావాళ్లు కానీ క్రీడాకారులు కానీ రాజకీయాల్లోకి వెళ్లకూడదు...

710
Virender Sehwag

ఎందుకంటే ఈ రెండు రంగాల్లో రాణించేవాళ్లు ఇగో వల్లనో లేక అధికార దాహం వల్లనో రాజకీయాల్లోకి వెళ్తారు. జనాలకు సేవ చేసేందుకు వారి దగ్గర సమయం ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే జనాలకు సమయాన్ని కేటాయిస్తారు. మిగిలిన వాళ్లంతా పీఆర్ టీమ్‌తోనే కథ నడిపిస్తారు..

810
Sehwag-Ganguly

నేను క్రికెట్‌లో ఉంటా, కామెంటేటర్‌గా ఉంటా. పార్ట్ టైం ఎంపీగా సమయం దొరికినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్  ఉండదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..  

910
Gautam Gambhir

వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే గౌతమ్ గంభీర్ కేవలం ఇగో వల్ల, అధికార దాహం వల్ల రాజకీయాల్లోకి వెళ్లాడని పరోక్షంగా కామెంట్ చేస్తున్నట్టు ఉంది. అయితే సేఫ్ సైడ్‌గా కొందరు మాత్రం దీనికి మినహాయింపు అనే కామెంట్‌తో వివాదం పెద్దగా కాకుండా గౌతీకి వీరూ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

1010

బీజేపీ పార్టీ నుంచి ఢిల్లీ ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్, పార్లమెంట్ సమావేశాలకు హాజరైంది కేవలం 30 శాతం మాత్రమే. ఇదే సమయంలో ఐపీఎల్‌లో లక్నో మెంటర్‌గా, కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు గంభీర్. పార్ట్ టైమ్ పొలిటీషన్ అనే మాట, వీరూ, గంభీర్‌ని ఉద్దేశించే అన్నాడనడానికి ఈ లెక్కలే ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు.. 

Recommended Photos