ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఆ ఇద్దరు ప్లేయర్లను విడుదల చేసిన రాజస్థాన్ రాయల్స్...

First Published Aug 18, 2021, 11:05 AM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఇద్దరు యంగ్ ప్లేయర్లను విడుదల చేసింది. ముంబై జట్టు, ఓమన్ టూర్‌కి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో ముంబై డొమెస్టిక్ టీమ్, ఓమన్ జాతీయ జట్టుతో మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడనుంది... 

ఆగస్టు 22 నుంచి ప్రారంభమయ్యే ఓమన్ టూర్ సెప్టెంబర్ 2 వరకూ సాగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరుపున ఆడే ఆల్‌రౌండర్ శామ్స్ ములానీ, ఈ టూర్‌కి కెప్టెన్‌గా ఎంపిక చేసింది ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీ...

ప్రస్తుతం రోహిత్ శర్మ, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, అజింకా రహానే వంటి ముంబై సీనియర్ ప్లేయర్లు ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడం, మిగిలినవాళ్లు ఐపీఎల్ 2021 ప్రిపరేషన్స్‌లో ఉండడంతో అందుబాటులో ఉన్న 14 మంది ప్లేయర్లను ఈ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. 

ఆల్‌రౌండర్ శివమ్ దూబే, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఓమన్ టూర్ కోసం విడుదల చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ ఇద్దరూ ఓమన్ టూర్ ముగించుకున్న తర్వాత సెప్టెంబర్ 3న యూఏఈ చేరుకుని తిరిగి జట్టుతో కలుస్తారు...

మస్కట్ చేరుకున్న తర్వాత కేవలం ఒక్క రోజు క్వారంటైన్‌లో గడిపే ముంబై జట్టు... ఆగస్టు 22న మొదటి టీ20 ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 24న రెండో టీ20, 26న ఆఖరి టీ20 మ్యాచ్ ఆడుతుంది...

ఆ తర్వాత ఆగస్టు 29న మొదటి వన్డే, 31న రెండో వన్డే జరుగుతాయి. సెప్టెంబర్ 2న ఆఖరి వన్డేతో ముంబై జట్టు, టూర్ ముగించుకుంది. ఈ టూర్ కోసం ఓమన్ ప్రభుత్వం, ముంబై జట్టుకి ప్రత్యేక అనుమతులు జారీ చేసింది...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీ నుంచి జరిగే ఈ టోర్నీ, ఓమన్ జట్టుకి ప్రాక్టీస్‌గా మారనుంటే... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి ముందు ముంబై జట్టుకి ఈ టూర్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది...

వర్షం కారణంగా ప్రాక్టీస్ చేయలేకపోతున్న ముంబై క్రికెటర్లకు ఈ టూర్ లక్కీగా దొరికిందని, ఓమన్‌లో ముంబై జట్టు విజయాలు సాధించినా, సాధించకపోయినా... వారికి కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ముంబై టీమ్ సీనియర్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు సలీల్ అంకోలా...

ఓమన్ టూర్‌లో పాల్గొనే ముంబై జట్టు: శామ్స్ ములానీ (కెప్టెన్), ఆకర్షిత్ గోమెల్, హార్ధిక్ తామోర్, ఆర్మన్ జాఫర్, చిమనీ సుతార్, శివమ్ దూబే, అమన్ ఖాన్, సుజిత్ నాయక్, యశస్వి జైస్వాల్, సుశాంక్ అట్టార్డే, మోహిత్ అవాస్తీ, సైరజ్ పాటిల్, దీపక్ శెట్టి, ద్రుమిల్ మత్కర్

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన ముంబై జట్టు, విజయ్ హాజారే ట్రోపీ ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది...

click me!