టీ20 వరల్డ్‌కప్‌లో ఆ ముగ్గురూ ఎలా ఆడతారో చూడాలని ఉంది... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Aug 17, 2021, 5:02 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించడంతో ఈ టోర్నీలో ఏ జట్టు ఫైనల్ చేరుతుంది? ఏ టీమ్ టైటిల్ ఫెవరెట్ అనే విషయంలో పెద్ద చర్చే మొదలైంది. తాజాగా భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ దీని గురించి స్పందించాడు...

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో కాకపోయినా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్...

తాజాగా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్, తన చమత్కారంతో క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకుంటున్నాడు. ఆ మధ్య కార్తీక్ చేసిన ఓ కామెంట్‌పై వివాదం రేగినా, మనోడు స్వయంగా క్షమాపణలు చెప్పడంతో అది ముగిసిపోయింది..

‘టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీల్లో ముగ్గురు ప్లేయర్ల ఎలా ఆడబోతున్నారననే ఆసక్తిగా చూస్తున్నా... వాళ్లు వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా...

నికోలస్ పూరన్ చాలా స్పెషల్ బ్యాట్స్‌మెన్. అతను తన కెరీర్‌కి ముగింపు పలికే సమయానికి టీ20ల్లో గ్రేట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా ఉంటాడు. అతని బ్యాట్ స్వింగ్ చూడచక్కగా ఉంటుంది...

టీ20 క్రికెట్‌లో పూరన్‌లా బ్యాటును స్వింగ్ చేసేవాళ్లు లేరు. అతను ఏ బ్యాట్స్‌మెన్ కొట్టనంత దూరానికి సిక్సర్ బాదగలడు. అతను వెస్టిండీస్‌కి అత్యంత విలువైన ఆటగాడు...

అలాగే మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియాకి చాలా కీలకంగా మారనుంది. ఆరంభ ఓవర్లలో, డెత్ ఓవర్లలో స్టార్క్ బంతితో ఎలా రాణిస్తాడనేదానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఉంటాయి. ఇప్పుడు అతని ప్రదర్శన మరీ అద్భుతంగా ఏమీ లేదు...

అయితే అతను రిథమ్‌ను అందిపుచ్చుకుంటాడు. అత్యంత అనుభవం కలిగిన మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియాకి కీ ప్లేయర్ అవుతాడు. టోర్నీలో ఆసీస్ ప్రదర్శన బాగుండాలంటే స్టార్క్ బాల్‌తో రాణించాల్సిందే...

ఇక హార్ధిక్ పాండ్యా విషయానికి వస్తే.. పెద్ద టోర్నీల్లో ఓటమి అంచుల దాకా వెళ్తున్నా, పట్టువదలకుండా పోరాడే మనస్థత్వం ఉన్న ప్లేయర్లు కావాలి. అలాంటి వాడే హార్ధిక్ పాండ్యా. బంతితోనూ, బ్యాటుతోనూ పాండ్యా మ్యాజిక్ చేయగలడు...

కీలక సమయాల్లో రన్‌రేటు పెంచాలన్నా... అలాగే నిలదొక్కుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే బంతులు వేయాలన్నా...అది హార్ధిక్ పాండ్యాకే సాధ్యం... అందుకే అతను చాలా తెలివైన ఆటగాడు’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

click me!