RCB vs KKR: ఐపీఎల్ ల‌వ‌ర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ సాగేనా?

Published : May 17, 2025, 05:36 PM IST

IPL 2025 RCB vs KKR: భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల త‌ర్వాత తాత్కాలికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 శ‌నివారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) జ‌ట్లు బెంగ‌ళూరు లోని ఏం.చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డ‌నున్నాయి.   

PREV
15
RCB vs KKR: ఐపీఎల్ ల‌వ‌ర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ సాగేనా?
IPL 2025 RCB vs KKR

IPL 2025 RCB vs KKR: ఐపీఎల్ 2025 శ‌నివారం తిరిగి ప్రారంభ‌మ‌వుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం పెద్ద విలన్ అయ్యే అవ‌కాశ‌ముంది. శనివారం సాయంత్రం బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్సీబీ-కేకేఆర్ ల మ‌ధ్య‌ కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కేకేఆర్ ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్ ను గెల‌వాల్సిందే. అలాంటి కీల‌క‌మైన ఈ మ్యాచ్‌ను వ‌ర్షం దెబ్బ‌కొట్టే ఛాన్స్ అధికంగా ఉంది.

25
IPL RCB

Accuweather రిపోర్టుల ప్ర‌కారం.. శనివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు భారీ వర్షాలు, తీవ్ర‌మైన ఈదురుగాలులు వీచే అవ‌కాశ‌ముంది. మ్యాచ్ ప్రారంభంలోనే వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా శనివారం సాయంత్రం వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. అలాగే, ఈదురుగాలుల వీచే అవకాశ‌ముంద‌ని అంచ‌నా వేసింది. ఇప్పటికే అక్కడి వాతావరణం మేఘాలతో నిండిపోయింది.

35
IPL RCB Virat kohli

అయితే, చిన్న‌స్వామి స్టేడియంలో ఆధునిక డ్రైనేజ్ సిస్టం ఉండటంతో వర్షం ఆగిన వెంటనే మ్యాచ్ ను కొన‌సాగించే అవ‌కాశ‌ముంది. కానీ, బెంగళూరులో ఇటీవల కుండపోత వర్షాలు వ‌చ్చాయి. శ‌నివారం సాయంత్రం కూడా ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం ఉంటే మ్యాచ్ నీటిలో మునిగిపోవ‌డం ప‌క్కా. 

45
IPl KKR

ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే, గత సీజన్ ఛాంపియ‌న్ అయిన కేకేఆర్ టోర్నీ నుండి అవుట్ అవుతుంది. ప్లేఆఫ్ అవ‌కాశాలు కోల్పోతుంది. ప్రస్తుతం కేకేఆర్ 11 పాయింట్లు ఉండగా, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా గరిష్టంగా 15 పాయింట్లకే పరిమితం అవుతుంది. ఇవి  ప్లే ఆఫ్స్‌కు ప‌రిపోయే పాయింట్లు  కావు.

 

55
Virat Kohli runs between the wickets

ఆర్సీబీ విష‌యానికి వ‌స్తే ఒక మ్యాచ్ రద్దయినా ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వారికి మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్క గెలుపుతో 18 పాయింట్లకు చేరుకొని నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. మిగిలిన మూడు గెలిస్తే, 22 పాయింట్లతో టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories