సిరాజ్, సుందర్ మధ్య మాటల యుద్ధం... కౌంటీ ఎలెవన్‌లో భారత జట్టుకి...

First Published Jul 22, 2021, 9:53 AM IST

కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు రాణించారు. కౌంటీ ఎలెవన్ ఓపెనర్ హసీబ్ హమీద్ సెంచరీతో చెలరేగినా మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ సహకరించకపోవడంతో భారత జట్టుకి ఆధిక్యం దక్కేలా ఉంది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఓపెనర్ హసీబ్ హమీద్ 246 బంతుల్లో 13 ఫోర్లతో 112 పరుగులు చేశాడు...
undefined
ఐదేళ్ల క్రితం భారత జట్టుపై టెస్టు మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన హమీద్, గాయం కారణంగా తొలి టెస్టు తర్వాత జట్టుకి దూరమయ్యాడు. ఐదేళ్ల తర్వాత వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు.
undefined
హమీద్‌కి మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ సరైన సహకారం ఇవ్వకపోవడంతో వరుస వికెట్లు కోల్పోయింది కౌంటీ ఎలెవన్. లియామ్ ప్యాటర్సన్ 33 పరుగులు చేయగా, లీడన్ జేమ్స్ 27 పరుగులు చేశారు.
undefined
కౌంటీ ఎలెవన్ తరుపున బరిలో దిగిన భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్, టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. అయితే వాషింగ్టన్ సుందర్‌కీ, భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌కీ మధ్య మాటల యుద్ధం జరిగింది...
undefined
బ్యాటింగ్‌కి వచ్చిన సుందర్‌ని సిరాజ్ ఏదో అన్నాడు. దానికి సుందర్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండడంతో సిరాజ్ మరోసారి ఏదో కామెంట్ చేశాడు.
undefined
ఒక్క పరుగుకే సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన సుందర్, పెవిలియన్‌కి వెళ్లేటప్పుడు సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేశాడు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ల మధ్య ఇలాంటి సంఘటన జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
కౌంటీ తరుపున భారత్ తరుపున బౌలింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ వేలికి గాయం కావడంతో అతనికి నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు...
undefined
భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్‌కి రెండు వికెట్లు దక్కాయి. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.
undefined
click me!