ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్... జయ్‌దేవ్ ఉన్కదట్ మొదటి టెస్టులో ప్లేయర్లు వీరే! ఆ ఒక్కడూ తప్ప...

First Published Dec 22, 2022, 11:08 AM IST

జయ్‌దేవ్ ఉనద్కట్, దేశవాళీ క్రికెట్‌లో సంచలనాలు క్రియేట్ చేసినా భారత జట్టు తరుపున మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్, 2022లో మొట్టమొదటి టెస్టు వికెట్ తీశాడు. 12 ఏళ్ల తర్వాత జయ్‌దేవ్‌కి సెకండ్ ఛాన్స్ దక్కింది...

Jaydev Unadkat

మహ్మద్ షమీ గాయంతో బంగ్లా టూర్‌కి దూరం కావడంతో ఆ ప్లేస్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి అవకాశం దక్కింది. ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్ చౌదరి, నవ్‌దీప్ సైనీ... ఇలా షమీ ప్లేస్‌ని రిప్లేస్ చేసే బౌలర్‌గా చాలామంది పేర్లు వినిపించినా.. 12 ఏళ్ల తర్వాత జయ్‌దేవ్‌కి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు..

బంగ్లాదేశ్ వీసా రావడం ఆలస్యం కావడంతో తొలి టెస్టు ఆడే అవకాశాన్ని కోల్పోయిన జయ్‌దేవ్ ఉనద్కట్, రెండో టెస్టులో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. 34 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన జాకీర్ హసన్‌ని అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో మొట్టమొదటి టెస్టు వికెట్‌ని కైవసం చేసుకున్నాడు...

Jaydev Unadkat

జయ్‌దేవ్ ఉన్కదట్ తొలి టెస్టు ఆడిన తర్వాత టీమిండియా ఇప్పటివరకూ 118 టెస్టు మ్యాచులు ఆడేసింది. అత్యధిక టెస్టుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ క్రికెటర్ గారెత్ బాటీ (142 టెస్టుల తర్వాత) తర్వాతి స్థానంలో నిలిచాడు జయ్‌దేవ్ ఉనద్కట్...

Image credit: Getty

2010లో సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన తొలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. అప్పటికి విరాట్ కోహ్లీ టెస్టు ఆరంగ్రేటం కూడా చేయలేదు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, జయ్‌దేవ్ ఉనద్కట్ ఆడిన తొలి టెస్టులో ప్లేయర్‌గా ఆడాడు..

VVS Laxman

ధోనీ కెప్టెన్సీలో తొలి టెస్టు ఆడిన జయ్‌దేవ్ ఉనద్కట్.. మొదటి మ్యాచ్‌ టీమ్‌లో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, శ్రీశాంత్ సభ్యులుగా ఉన్నారు...

అప్పటి టీమ్‌లో ఒక్క ఇషాంత్ శర్మ మినహా మిగిలిన భారత జట్టు ప్లేయర్లు అందరూ ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడుతున్న జట్టులో ఉన్న ఛతేశ్వర్ పూజారా, ఉమేశ్ యాదవ్... ఉనద్కట్ ఆడిన తొలి టెస్టులో రిజర్వు ప్లేయర్లుగా ఉన్నారు. 

Umesh Yadav

భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌తో మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.. జయ్‌దేవ్ ఉనద్కట్ అప్పటి నుంచి వరుసగా టీమిండియా తరుపున మ్యాచులు ఆడి ఉంటే ఇషాంత్ శర్మతో పాటు 100+ టెస్టులు పూర్తి చేసుకునేవాడు..

AB De Villiers

జయ్‌దేవ్ ఉనద్కట్ ఆడిన మొదటి టెస్టులోని భారత జట్టు ప్లేయర్లు మాత్రమే కాదు, సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా రిటైర్ అయిపోయారు. గ్రేమ్ స్మిత్, ఆల్వీనో పీటర్సన్, హషీం ఆమ్లా, జాక్వస్ కలీస్, ఏబీ డివిల్లియర్స్, ఆస్వెల్ ప్రిన్స్, మార్క్ బ్రౌచర్, పాల్ హారీస్, డేల్ స్టేయిన్, మోర్నె మార్కెల్... సఫారీ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు...

click me!