చెప్పి మరీ పూజారాని తప్పించిన రాహుల్ ద్రావిడ్... విండీస్ టూర్‌లో ఫెయిల్ అయితే ఆ ఇద్దరికీ ఇదే గతి!

Published : Jun 23, 2023, 06:32 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన భారత జట్టులో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది... దీంతో పూజారా కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...

PREV
19
చెప్పి మరీ పూజారాని తప్పించిన రాహుల్ ద్రావిడ్... విండీస్ టూర్‌లో ఫెయిల్ అయితే ఆ ఇద్దరికీ ఇదే గతి!
Rahul Dravid-Rohit Sharma

ఛతేశ్వర్ పూజారాని తప్పించడానికి ముందు టీమిండియా సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అతనితో మాట్లాడారని సమాచారం. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పూజారాని తప్పిస్తున్నట్టు, దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడితే తిరిగి భారత జట్టు నుంచి పిలుపు దక్కుతుందని భరోసా కూడా ఇచ్చారట..

29

వెస్టిండీస్ టూర్‌లో చోటు దక్కకపోవడంతో దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరుపున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు ఛతేశ్వర్ పూజారా. అయితే ఇంతకుముందు వృద్ధిమాన్ సాహా విషయంలో కూడా ఇదే జరిగింది..

39

రిషబ్ పంత్ అదరగొడుతుండడంతో వృద్ధిమాన్ సాహాని రెండేళ్ల పాటు రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన టీమిండియా, 2021 న్యూజిలాండ్ సిరీస్ తర్వాత పూర్తిగా పక్కనబెట్టేసింది... అప్పుడు కూడా రాహుల్ ద్రావిడ్, దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడితే తిరిగి సెలక్ట్ చేస్తామని సాహాకి మాటిచ్చాడు. అయితే అలా జరగలేదు..
 

49
Image credit: Getty

గత ఏడాది వన్డేల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్ విషయంలోనూ ఇదే జరిగింది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకే పక్కనబెడుతున్నామని, బాగా ఆడితే తిరిగి టీమ్‌లో చోటు ఉంటుందని రాహుల్ ద్రావిడ్ అండ్ కో చెప్పినట్టు శిఖర్ ధావన్ కామెంట్ చేశాడు. గబ్బర్‌ని కూడా మళ్లీ టీమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు టీమిండియా...
 

59
Cheteshwar Pujara

టీమ్‌కి భారంగా మారుతున్న సీనియర్లను ఒక్కొక్కరిగా తప్పించేందుకు టీమిండియా సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్‌లో ఫెయిల్ అయితే టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా ఈ అనుభవం ఎదురుకాక తప్పదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

69
Rohit and Pujara

ఛతేశ్వర్ పూజారా, బంగ్లాదేశ్ టూర్‌లో సెంచరీ చేస్తే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీలు చేశారు. 35 ఏళ్లు దాటిన ఈ ఇద్దరి అనుభవం టీమిండియాకి చాలా అవసరం..

79

అయితే ఎంత అనుభవం ఉన్నా, టీమ్‌కి అవసరమైనప్పుడు బాగా ఆడకపోతే వేస్టే. అందుకే వెస్టిండీస్ టూర్‌లో ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీ, రోహిత్‌లపై కూడా వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు... 

89

వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత దాదాపు నాలుగు నెలల వరకూ టెస్టు క్రికెట్ ఆడడం లేదు టీమిండియా. డిసెంబర్ 2023లో సౌతాఫ్రికా టూర్‌కి వెళ్తోంది. అప్పటికి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కూడా ముగుస్తుంది..

99

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే ఓకే కానీ, ఓడితే మాత్రం భారత జట్టుపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా పడుతుంది. దీంతో నాలుగు నెలల తర్వాత టెస్టు టీమ్‌లో చోటు ఉండాలంటే రోహిత్, విరాట్ బ్యాటు నుంచి విండీస్ టూర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రావాల్సిందే.. 

Read more Photos on
click me!

Recommended Stories