ఓ శకం ముగిసినట్టేనా! శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, ఇప్పుడు ఛతేశ్వర్ పూజారా.. రీఎంట్రీ కష్టమే...

Published : Jun 23, 2023, 05:13 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారా దక్కలేదు. దీంతో టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారా శకం ఇక ముగిసినట్టే...

PREV
19
ఓ శకం ముగిసినట్టేనా! శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, ఇప్పుడు ఛతేశ్వర్ పూజారా.. రీఎంట్రీ కష్టమే...
Rohit and Pujara

2021 ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారా- అజింకా రహానేలను టెస్టుల నుంచి తప్పించింది టీమిండియా. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన పూజారా, కొన్ని రోజులకే టీమ్‌లో తిరిగి చోటు దక్కించుకున్నాడు...

29
Cheteshwar Pujara

బంగ్లాదేశ్ టూర్‌లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించిన ఛతేశ్వర్ పూజారా, 1443 రోజుల తర్వాత అంతర్జాతీయ శతకం సాధించాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పూజారా బ్యాటు నుంచి ఆశించిన ఇన్నింగ్స్‌లు రాలేదు..

39
Cheteshwar Pujara

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో పూజారాకి చోటు కరువైంది..

49

35 ఏళ్ల ఛతేశ్వర్ పూజారా, ఈ వయసులో టెస్టు టీమ్‌లో రీఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే పూజారా ప్లేస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లను ఎంపిక చేశారు సెలక్టర్లు. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరినీ టెస్టుల్లో కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

59
Cheteshwar Pujara

103 టెస్టులు ఆడిన ఛతేశ్వర్ పూజారా, నేటి తరంలో టీమిండియా తరుపున నూటికి పైగా టెస్టులు ఆడిన ప్లేయర్లలో ఒకడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 

69
Wriddhiman Saha and Ishant Sharma


డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడిన ఇషాంత్ శర్మకు సౌతాఫ్రికా టూర్ నుంచి జట్టులో చోటు కరువైంది..

79

అదే టూర్‌లో ఆడిన టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా టీమ్‌లో చోటు కోల్పోయాడు. 40 టెస్టులు ఆడిన వృద్ధిమాన్ సాహా వయసు 38 ఏళ్లు. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా సాహా వైపు చూడలేదు సెలక్టర్లు..
 

89

దీంతో ఇకపై ఈ ముగ్గురికీ టెస్టుల్లో తిరిగి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే. వీరితో పాటు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ కూడా ముగిసినట్టే... ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టే గబ్బర్‌, ఒకానొక దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడి పరుగులు చేశాడు.. కానీ క్రేజ్ సంపాదించడంలో మాత్రం వెనకబడ్డాడు. 
 

99

37 ఏళ్ల శిఖర్ ధావన్, టీమిండియా తరుపున 167 వన్డేలు, 34 టెస్టులు ఆడాడు. 2022 బంగ్లాదేశ్ టూర్‌లో ఆఖరి వన్డే ఆడిన శిఖర్ ధావన్, మూడు ఫార్మాట్లలోనూ చోటు కోల్పోయాడు.  శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, ఇప్పుడు ఛతేశ్వర్ పూజారా.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ నలుగురు సీనియర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే..

click me!

Recommended Stories