హార్ధిక్‌ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ! ఆ విషయం నాకు తెలీదు, సెలక్టర్లనే ఆడగాలి - రాహుల్ ద్రావిడ్...

First Published Jan 24, 2023, 12:01 PM IST

లేటు వయసులో మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఫిట్‌నెస్, బిజీ షెడ్యూల్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ ఇలా వివిధ కారణాల వల్ల గత ఏడాది రోహిత్ ఆడిన మ్యాచుల కంటే ఆడని మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

Image credit: PTI

గత ఏడాది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా.. టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించారు. వీరిలో ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీకే ఎక్కువ మార్కులు పడ్డాయి...
 

rohit sharma

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు, టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరినా ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది..  పొట్టి ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు...

Rohit Sharma

ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... న్యూజిలాండ్‌తో సిరీస్ కూడా ఆడడం లేదు. అయితే రోహిత్ శర్మ మాత్రం టీ20లపై ఆశ వదులుకోలేదని అన్నాడు.. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దీనిపై మాట్లాడాడు...

Image credit: PTI

‘టీమిండియా ఇద్దరు కెప్టెన్ల పాలసీని ఎంచుకుందనే విషయం నాకు తెలీదు. ఈ విషయాన్ని సెలక్టర్లను అడిగితేనే బాగుంటుంది... ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరం...

Image credit: PTI

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు టీ20ల్లో ఆడడం అవసరం అనుకుంటే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ని పక్కనబెట్టి ఆడిస్తాం. ఇప్పటికైతే మా ప్రాధాన్యం టెస్టులు, వన్డేలపైనే. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఉన్నాయి...

Image credit: PTI

ప్లేయర్ల గాయాలు టీమ్‌ని ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్, ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ రెండూ ఒక్కటి కాదు. గాయపడిన ప్లేయర్ల స్థానంలో వేరేవాళ్లు ఆడడం వేరు, సీనియర్లకు రెస్ట్ ఇచ్చినప్పుడు వారి స్థానంలో వేరే ప్లేయర్లు ఆడడం వేరు...

ఐపీఎల్‌లో ప్లేయర్లు గాయపడితే ఏం చేయాలనేదానిపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్లేయర్లు గాయపడ్డారని తెలిస్తే, వారిని ఐపీఎల్ నుంచి తప్పించే అధికారం బీసీసీఐకి ఉంది. పూర్తిగా గాయం మానకపోతే ఏ ప్లేయర్ కూడా మళ్లీ మ్యాచులు ఆడకుండా చూస్తాం...

వన్డే వరల్డ్ కప్ 2023, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండూ టీమిండియాకి చాలా ముఖ్యమైన సిరీస్‌లు. కాబట్టి ఈ రెండు టోర్నీల ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై ప్రత్యేకమైన ఫోకస్, కేర్ ఉంటాయి... అవసరమైతే వారిని ఐపీఎల్ నుంచి తప్పిస్తాం.. ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..

click me!