షాహిద్ ఆఫ్రిదీకి గుడ్‌బై... పాక్ క్రికెట్ బోర్డు కొత్త చీఫ్ సెలక్టర్‌గా హరూన్ రషీద్...

First Published Jan 24, 2023, 11:24 AM IST

క్యాలెండర్‌లో డేట్స్ మారినంత ఈజీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పులు జరుగుతున్నాయి...  రమీజ్ రాజాని పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి నజం సేథీకి ఆ బాధ్యతలు అప్పగించింది పాకిస్తాన్. నజం సేథీ బాధ్యతలు తీసుకున్నాక సెలక్టర్ల బోర్డుపై వేటు వేశాడు. పూర్తి సెలక్షన్ కమిటీని రద్దు చేశాడు...

పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ, పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా తాత్కాలికంగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే నెల కూడా గడవకముందే  కొత్త చీఫ్ సెలక్టర్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

సోమవారం రాత్రి షాహిద్ ఆఫ్రిదీని తప్పిస్తూ హరూన్ రషీద్‌ని కొత్త పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 69 ఏళ్ల హరూన్ రషీద్, పాకిస్తాన్ తరుపున 23 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు...

Image credit: Wikimedia Commons

ఓవరాల్‌గా 1400 పరుగులు చేసిన హరూన్ రషీద్, అహ్మద్ రషీద్, ఫరూక్ రషీద్, మహమ్మద్ రషీద్, ఉమర్ రషీద్ వంటి క్రికెటర్లకు సోదరుడు. 1979 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో స్లోగా బ్యాటింగ్ చేసి పాక్ ఓటమికి కారణమయ్యాడనే ఉద్దేశంతో హరూన్ రషీద్ కారుపై దాడి చేశారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...
 

1995లో పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుకి సెలక్టర్‌గా వ్యవహరించాడు హరూన్ రషీద్... 1995లో పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్లు మహమ్మద్ వసీం, షాహిద్ ఆఫ్రిదీలను అండర్19 టీమ్‌కి సెలక్ట్ చేసి, వాళ్లు పాకిస్తాన్ తరుపున ఆడేందుకు కారణమయ్యాడు హరూన్ రషీద్. 

1995లో ఓ ప్లేయర్‌ని సెలక్ట్ చేయని కారణంగా హరూన్ రషీద్‌ని చంపేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. హిట్ అండ్ రన్ అటాక్ నుంచి తృటిలో తప్పించుకున్న హరూన్ రషీద్, నజం సేథీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు..
 

click me!