రవీంద్ర జడేజా కంటే అతను బెస్ట్ ఫీల్డర్... భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కామెంట్స్...

Published : Dec 12, 2021, 04:13 PM IST

ప్రస్తుత తరంలో బెస్ట్ ఫీల్డర్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా. అటు బ్యాటుతో బౌండరీల మోత మోగించే జడ్డూ, బౌలింగ్‌లోనే కాకుండా, ఫీల్డ్‌లోనూ మెరుపులా కదులుతాడు. అయితే జడేజా కంటే ఓ మాజీ క్రికెటర్ బెటర్ ఫీల్డర్ అంటున్నాడు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

PREV
19
రవీంద్ర జడేజా కంటే అతను బెస్ట్ ఫీల్డర్... భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కామెంట్స్...

భారత జట్టుకి చిరస్మరణీయ విజయాలు అందించి, వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైదరాబాదీ మహ్మద్ అజారుద్దీన్ ఒకడు... అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అజారుద్దీన్ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది...

29

బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గానే కాకుండా స్లిప్‌లో అద్భుతమైన ఫీల్డర్‌గానూ నిరూపించుకున్నాడు మహ్మద్ అజారుద్దీన్... టెస్టుల్లో 105, వన్డేల్లో 156 క్యాచులు అందుకున్నాడు అజార్...

39

‘రెండు భిన్నమైన తరాల మధ్య పోలిక పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పటి స్టాండర్స్ మారిపోయాయి. అయితే ఇప్పటికీ అజ్జూ భాయ్ (అజారుద్దీన్) బెస్ట్ ఫీల్డర్...

49

అప్పట్లో భారత జట్టులో ఫిట్‌నెస్‌పై ఇంత శ్రద్ధ లేదు. 90ల్లోనే అజారుద్దీన్ అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకునేవారు. నన్ను అడిగితే జడేజా కంటే అజార్ చాలా బెస్ట్ ఫీల్డర్...

59

ఎందుకంటే ఆయన క్రీజులో అథ్లెట్లిక్‌లా కదిలేవాడు. ఆయన చేతుల్లో పడిందంటే అది క్యాచ్ అవ్వాల్సిందే, అలాగే రనౌట్ల విషయంలోనూ త్రోస్ అద్భుతంగా చేసేవాడు...

69

అజారుద్దీన్ సెట్ చేసిన బెంచ్ మార్క్ వేరే స్థాయి... జడేజా బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకోవడానికి పరుగెడుతుంటే చూడడానికి అందంగా ఉంటుంది...

79

ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌ ఫీల్డింగ్‌లో జడ్డూ స్టార్. మిగిలిన క్రికెట్ ప్రపంచాన్ని తన ఫీల్డింగ్ విన్యాసాలతో పక్కనబెట్టేశాడు జడేజా. ప్రాక్టీస్ చేసేకొద్దీ ఫీల్డర్లలో నమ్మకం పెరుగుతూ ఉంటుంది...

89

వరుసగా మ్యాచులు ఆడే వాళ్లు, ప్రాక్టీస్‌తో బెస్ట్ స్లిప్ ఫీల్డర్లుగా మారతారు. అందుకే పూజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... మంచి స్లిప్ ఫీల్డర్లు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

99

ఏడేళ్ల పాటు భారత జట్టుకి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఆర్ శ్రీధర్, టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టి దిలీప్, కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

click me!

Recommended Stories