ప్రస్తుత తరంలో వీళ్లే టాప్ 5 బ్యాట్స్‌మెన్... షేన్ వార్న్ ఫెవరెట్స్ లిస్టులో టాప్ 4లో విరాట్ కోహ్లీ...

First Published Dec 12, 2021, 2:51 PM IST

విరాట్ కోహ్లీ, టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ అనే బేధాలు లేకుండా మూడు ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారించిన బ్యాట్స్‌మెన్. అయితే రెండేళ్లుగా ఆ రన్ మెషిన్‌, మునుపటి వేగంతో పరుగులు చేయడం లేదు. దీంతో ఒకప్పుడు కోహ్లీని వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్‌గా పొగిడిన నోళ్లు కూడా ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నాయి...

తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్... ప్రస్తుత తరంలో ది బెస్ట్ టాప్ 5 బ్యాట్స్‌మెన్ వీళ్లేనంటూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు...

ఎప్పటిలాగే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌, ప్రస్తుత తరంలో నెం.1 బ్యాట్స్‌మెన్‌ అంటూ ప్రకటించాడు షేన్ వార్న్. అయితే ఈ ఏడాది విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరూ కూడా ఒకే సగటుతో పరుగులు చేయడం విశేషం...

2019 అక్టోబర్ తర్వాత విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరూ 38.6 యావరేజ్‌తోనే టెస్టుల్లో పరుగులు చేశారు. అయితే ఇండియా, ఆస్ట్రేలియా టూర్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీలు చేయడంతో అతన్ని నెం.1 బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించాడు షేన్ వార్న్...

‘ఇప్పుడున్న వారిలో స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉంటాడు. ఎందుకంటే అతన్ని అన్ని చోట్ల, అన్ని పరిస్థితుల్లో వరల్డ్ క్లాస్ బౌలర్ల బౌలింగ్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్మిత్ ఓ బ్రిలియెంట్ బ్యాట్స్‌మెన్...’ అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వార్న్...

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను నెం.1 బ్యాట్స్‌మెన్‌గా పేర్కొన్నాడు షేన్ వార్న్. ఈ ఏడాది 8 సెంచరీలు చేసిన జో రూట్, ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో ఉన్నాడు...

ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్ గెలవడంతో పాటు నిలకడగా పరుగులు సాధిస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ కేన్ విలియంసన్‌కి టాప్ 3లో చోటు దక్కింది...

ఈ మధ్య సెంచరీ మార్కును అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీకి షేన్ వార్న్ లిస్టులో టాప్ 4గా చోటు దక్కింది. రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయినా, టెస్టుల్లో విరాట్ సాధించిన రికార్డులను తక్కువ చేయలేమని అభిప్రాయపడ్డాడు షేన్ వార్న్...

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్‌కి షేన్ వార్న్ లిస్టులో టాప్ 5లో చోటు దక్కింది. గత 19 టెస్టుల్లో 1959 పరుగులు చేసిన లబుషేన్, 60 యావరేజ్‌తో టెస్టుల్లో పరుగులు సాధిస్తున్నాడు...

బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన తొలి టెస్టులో జో రూట్ రెండో ఇన్నింగ్స్‌లో 80+ పరుగులతో ఆకట్టుకోగా, స్టీవ్ స్మిత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మార్నస్ లబుషేన్ తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసి, డేవిడ్ వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కి 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

click me!