అంత సీన్ లేదు, వచ్చే ఏడాది మళ్లీ విరాట్ కోహ్లీయే కెప్టెన్ అవుతాడు... అశ్విన్ కామెంట్స్...

Published : Mar 24, 2022, 01:56 PM IST

టీమిండియా కెప్టెన్‌గా ఎంత సక్సెస్ అయినా, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా టైటిల్ గెలవాలనే విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు. 9 సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, గత ఏడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫాఫ్ డుప్లిసిస్, ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

PREV
18
అంత సీన్ లేదు, వచ్చే ఏడాది మళ్లీ విరాట్ కోహ్లీయే కెప్టెన్ అవుతాడు... అశ్విన్ కామెంట్స్...

ఐపీఎల్ మెగా వేలంలో రూ.7 కోట్లకు డుప్లిసిస్‌ను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ, అనేక విశ్లేషణలు, విస్తృతమైన చర్చల తర్వాత అతనికే కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది...

28

దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్‌కి మంచి రికార్డు ఉంది. అలాగే గత ఏడాది సీఎస్‌కే ఓపెనర్‌గా 630+ పరుగులు చేసి, 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయాడు డుప్లిసిస్...

38

37 ఏళ్ల డుప్లిసిస్‌, కెప్టెన్‌గా ఆర్‌సీబీ టైటిల్ ఆశలను నెరవేరుస్తాడని భారీ అంచనాలే పెట్టుకున్నారు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ బెంగళూరు ఫ్యాన్స్ బ్యాచ్...

48

అయితే ఆర్‌సీబీకి డుప్లిసిస్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడని, మళ్లీ విరాట్ కోహ్లీకే కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని అంటున్నాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్..

58

‘ఫాఫ్ డుప్లిసిస్‌కి ఇప్పటికే 37 ఏళ్లు. నాకు తెలిసి, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాదిలో అతను రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు డుప్లిసిస్‌కి కెప్టెన్సీ అప్పగించారు. 

68

డుప్లిసిస్‌కి కెప్టెన్సీ ఇవ్వడం తప్పని అనడం లేదు. ఆయన అనుభవం, ఆర్‌సీబీకి బాగా ఉపయోగపడుతుంది. అదీకాకుండా గత ఏడాది ఎమ్మెస్ ధోనీ టీమ్‌లో ఆడి, టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించాడు...

78

ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొన్నేళ్లుగా టైటిల్ గెలవలేకపోతున్నందుకు విరాట్ కోహ్లీ బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. అందుకే ఈ ఏడాది బ్రేక్ తీసుకుని ఉంటాడు...

88

నా అంచనా ప్రకారం వచ్చే ఏడాది మళ్లీ విరాట్ కోహ్లీనే, ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమించబడవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

Read more Photos on
click me!

Recommended Stories