ఇదేం టీమ్ సెలక్షన్, మ్యాచ్ విన్నర్లు ఏరి? ఈసారి కూడా మీరు టైటిల్ గెలవడం కష్టమే...

First Published | Mar 24, 2022, 12:30 PM IST

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఎంత మంది కెప్టెన్లను మార్చినా, పేరు కలిసి రావడం లేదేమోనని ఫ్రాంఛైజీ పేరు, లోగో, జెర్సీ మార్చి చూసినా పంజాబ్ కింగ్స్ టీమ్ తలరాత మాత్రం మారడం లేదు...

ఐపీఎల్ 2008లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో సెమీ ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, 2014లో జార్జ్ బెయిలీ సారథ్యంలో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచింది... మిగిలిన 12 సీజన్లలో గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది...

ఐపీఎల్‌లో పూర్ పర్ఫామెన్స్ ఇస్తున్న జట్లలో ఒకటిగా నిలిచిన పంజాబ్ కింగ్స్, గత మూడు సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైంది. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో గత రెండు సీజన్లు ఆడిన పంజాబ్, ఈసారి మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది...

Latest Videos


ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం మయాంక్ అగర్వాల్‌తో పాటు యంగ్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్, టీమ్ మొత్తాన్ని వేలానికి వదిలేసింది...

‘పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే ఈసారి వేలంలో వారి టీమ్ సెలక్షన్ సరిగా లేదు. టైటిల్ గెలవడానికి కావాల్సిన మ్యాచ్ విన్నర్లు ఆ జట్టులో కనిపించడం లేదు...
 

పెద్దగా స్టార్లు లేకపోవడంతో పంజాబ్ కింగ్స్‌పై ఎలాంటి అంచనాలు లేవు. వాళ్లు ఈసారి కూడా టైటిల్ గెలవడం కష్టమే. అయితే దీన్నే పంజాబ్ కింగ్స్ అడ్వాంటేజ్‌గా వాడుకోవచ్చు...

ఎలాంటి అంచనాలు లేనప్పుడు, ఎలాంటి ప్రెషర్ ఉండదు. స్వేచ్ఛగా ఆడొచ్చు. కాబట్టి పంజాబ్ కింగ్స్ కొన్ని సర్‌ప్రైజింగ్ విజయాలు అందుకుంటుంది...

అయితే టైటిల్ గెలవాలంటే జట్టులో మ్యాచ్ విన్నర్లు కావాలి. టీ20 ఫార్మాట్‌లో వరుసగా విజయాలు సాధించడం చాలా అవసరం. అలాంటి జట్టు కూర్పు అయితే పంజాబ్ కింగ్స్‌లో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో శిఖర్ ధావన్, భనుక రాజపక్ష, లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్ భవ, ఓడియన్ స్మిత్, రిషి ధావన్, జానీ బెయిర్‌స్టో, కగిసో రబాడా, ఇషాన్ పోరెల్, సందీప్ శర్మ, రాహుల్ చాహార్, నాథన్ ఎల్లీస్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

వీరితో పాటు షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రభుసిమ్రాన్ సింగ్ వంటి గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మార్చి 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదటి మ్యాచ్ ఆడనుంది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత ఏప్రిల్ 2న కేకేఆర్‌తో, ఏప్పిల్ 3న సీఎస్‌కేతో... ఏప్పిల్ 8న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులు ఆడనుంది పంజాబ్ కింగ్స్...

click me!