ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ జట్టు ఇదేనని చెప్పడం కష్టం. గుజరాత్ లయన్స్ వంటి ఒకటి, రెండు జట్లు మినహా మిగిలిన జట్లన్నీ పటిష్టంగా, టైటిల్ గెలిచేలాగే కనిపిస్తున్నాయి. అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచే జట్టేదే చెప్పేశాడు...
ఐపీఎల్ 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
210
ఐపీఎల్ 2021 సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి క్వాలిఫైయర్, ఎలిమేటర్ 2 మ్యాచుల్లో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది...
310
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్, అత్యధిక వికెట్లు తీసిన కగిసో రబాడా, ఆవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లు.. ఈ సీజన్‌లో వేరే జట్ల తరుపున ఆడబోతున్నారు...
410
ఐపీఎల్ 2022 మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్, లుంగి ఇంగిడి, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రోవ్‌మన్ పావెల్ వంటి స్టార్లను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఈ సారి ఛాంపియన్‌గా నిలుస్తుందని అంటున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
510
‘గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా రిషబ్ పంత్ కావాల్సిన అనుభవం సంపాదించాడు. గత సీజన్‌లో చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో పంత్ పాఠాలు నేర్చుకునే ఉంటాడు...
610
అదీకాకుండా ఇప్పుడు అతను బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. వేలంలో ఢిల్లీ, చాలా సెలక్టివ్‌గా మ్యాచ్ విన్నర్లనే ఏరికోరి ఎంచుకుంది. అది వారిని పటిష్టమైన టీమ్‌గా నిలబెట్టింది...
710
ఎలా చూసినా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్... ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
810
గవాస్కర్ చెప్పినట్టు ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ టైటిల్ గెలిస్తే... 2022 సీజన్‌లో కొత్త ఛాంపియన్‌గా చూసే అవకాశం దక్కుతుంది.
910
ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ ఐదుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు, కేకేఆర్ రెండు సార్లు టైటిల్ గెలవగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్ తలా ఓసారి టైటిల్ గెలిచాయి...