తండ్రి త్యాగం.. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు కుర్రాడు.. ఎవ‌రీ షేక్ ర‌షీద్?

Who Is Sheikh Rashid: గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఎంట్రీ అద‌రిపోయింది. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో రషీద్ దూకుడుగా ఆడుతూ 19 బంతుల్లో 6 బౌండరీలతో 27 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్రతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. రషీద్ కొట్టిన షాట్స్ చూసిన కామెంటర్స్ అతను విరాట్ కోహ్లీ షేడ్స్ ను కలిగి ఉన్నాడని కామెంట్స్ చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసలు కురిపించారు.
 

Fathers sacrifice.. Another Telugu boy who entered IPL csk.. Who is Sheikh Rashid? His cricket journey in telugu rma
2025 IPL - Lucknow Super Giants v Chennai Super Kings

Who Is Sheikh Rashid : మ‌రో తెలుగు కుర్రాడు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. త‌న తండ్రి త్యాగం ఇప్పుడు అద్బుత‌మైన ఫ‌లితాలు ఇస్తోంది. గుంటూరు కారం ఘాటులా రెచ్చిపోతూ తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే బ్యాటింతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. భార‌త్ కు మ‌రో భ‌విష్య‌త్తు స్టార్ దొరికాడు.. అత‌నే షేక్ ర‌షీద్. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అరంగేట్రం చేసిన తెలుగు యంగ్ ప్లేయ‌ర్ షేక్ రషీద్ అద్భుత‌మైన ఆట‌తో ఆకట్టుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టి 19 బంతుల్లో 27 పరుగుల మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. అత‌ని ఇన్నింగ్స్ చిన్న‌దే అయినా.. అద్భుత‌మైన షాట్స్ తో అల‌రించాడు. 

2025 IPL - Lucknow Super Giants v Chennai Super Kings

షేక్ ర‌షీద్ అడిన షాట్స్ చూసి అత‌ని ఆట‌లో విరాట్ కోహ్లీ షేడ్స్ ఉన్నాయ‌ని కామెంటర్స్ పేర్కొన‌డం మ‌నోడి ఆట‌తీరు ఎలా ఉంద‌నేది చెబుతోంది. త‌న ఇన్నింగ్స్‌లో 6 బౌండరీలు బాది 142.11 స్ట్రైక్ రేట్ తో ఆట‌ను కొనసాగించాడు. వ‌రుస ఓట‌ములతో ఇబ్బంది ప‌డుతున్న ధోనీ టీమ్ కు భరోసా ఇస్తూ.. తన ఫస్ట్‌ ఇంప్రెషన్‌తోనే ఫ్యాన్స్‌ను మెప్పించాడు.

ఎవ‌రీ షేక్ ర‌షీద్? 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. దిల్ షుఖ్ న‌గ‌ర్, హైదరాబాద్‌లోని స్పోర్టివ్ క్రికెట్ క్లబ్ ద్వారా తన క్రికెట్ జర్నీ మొదలుపెట్టాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున అద్భుతంగా రాణించిన ఈ యంగ్ ప్లేయ‌ర్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ 2023లోనే జ‌ట్టులోకి తీసుకుంది. కానీ, తొలిసారి ఐపీఎల్ ప్లేయింగ్ 11లో ఆడే అవ‌కాశం ఇప్పుడు ల‌భించింది. 


షేక్ రషీద్ విజయం వెనుక తండ్రి త్యాగం  

షేక్ రషీద్‌ను క్రికెటర్ చేయాలనే ఆశతో అతని తండ్రి షేక్ బలీషా తన ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసారు. మెరుగైన శిక్షణ కోసం ప్రతిరోజూ రషీద్‌ను మంగళగిరి నుండి 40 కిలోమీటర్ల దూరంలోని నెట్ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారు. తండ్రి త్యాగం నేడు ఫ‌లించింది. త‌న కొడుకును భార‌త భ‌విష్య‌త్తు సూప‌ర్ స్టార్ అయ్యే ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. 

అండర్-19 ప్రపంచకప్ ఛాంపియన్ షేక్ ర‌షీద్ 

2022లో యష్ ధూల్ నేతృత్వంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన సమయంలో షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అత‌ను ఆ టోర్నమెంట్‌లో 4 మ్యాచ్‌ల్లో 201 పరుగులు చేసి టీమ్‌కు కీలకమైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. సెమీఫైనల్లో 94 పరుగులు, ఫైనల్లో అర్ధశతకం కొట్టిన షేక్ రషీద్.. భారత్ విజయంలో కీ ప్లేయ‌ర్ పాత్ర పోషించాడు.

చెన్నై టీమ్ లో షేక్ ర‌షీద్ 

దేశ‌వాళీ క్రికెట్ లో అద‌రిపోయే నాక్ లు ఆడిన షేక్ ర‌షీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షల‌కు కొనుగోలు చేసింది. ఎట్టకేలకు ఇప్పుడు మైదానంలో అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా త‌న‌ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. తొలి మ్యాచ్ లో మంచి నాక్ ఆడిన షేక్ ర‌షీద్ భవిష్యత్తులో మ‌రిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లను ఆడ‌తాడ‌ని చెన్నై టీమ్ కూడా అత‌నిపై న‌మ్మ‌కంగా ఉంది. 

Latest Videos

vuukle one pixel image
click me!