IPL 2025 LSG vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు వరుస ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈసారి ధోని ఫినిషర్ పాత్రను చాలా బాగా పోషించాడు. అతనికి తోడుగా చివరి వరకు క్రీజులో ఉండి శివమ్ దూబే చెన్నై టీమ్ కు విన్నింగ్ పరుగులు కొట్టాడు. ఈ గెలుపుతో సీఎస్కే ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉంది.
ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 23 పరుగులకే ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే, రిషబ్ పంత్ అర్ధ సెంచరీ, మిచెల్ మార్ష్ అద్భుతమైన 30 పరుగులతో లక్నో జట్టు స్కోరు బోర్డుపై 166 పరుగులు చేసింది.

చెన్నై స్పిన్నర్ల సూపర్ బౌలింగ్
కెప్టెన్ ధోనీ స్పిన్నర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు. ఫాస్ట్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా 1 వికెట్ తీసుకొని జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు.
దుబే, ధోని ఇన్నింగ్స్ లతో చెన్నై గెలుపు
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది రెండో విజయం. ఒక దశలో చెన్నై నుంచి మ్యాచ్ జారిపోయింది. కానీ ఆ తర్వాత శివం దూబే, ధోని బాధ్యత తీసుకుని చెన్నైకి విజయాన్ని అందించారు. ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టాడు. శివం దూబే 43 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. లక్నో టీమ్ 166/7 (20) పరుగులు చేయగా, ఆర్సీబీ 168/5 (19.3) పరుగుల తో విజయాన్ని అందుకుంది.