షారుఖ్ ఖాన్ ను కాద‌ని భార‌త స్టార్ క్రికెట‌ర్ ను పెళ్లి చేసుకుంటానన్న ప్రియాంక చోప్రా..

First Published | Aug 23, 2024, 1:48 PM IST

Priyanka Chopra : ప్రియాంక చోప్రా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను కాదనీ, ఒక భార‌త స్టార్ క్రికెట‌ర్ ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. ఈ స్టార్ క్రికెట‌ర్ ఏవ‌రు?  ఎందుకు అత‌న్నే పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు? అస‌లు ఏం జ‌రిగింది? అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Priyanka Chopra : బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు అంత‌ర్జాతీయ వేదిక‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రియాంక చోప్రా. మ‌స్తు పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ మిస్ వరల్డ్ అయిన తర్వాత సినిమాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

Image: Nick Jonas, Priyanka Chopra, Shah Rukh Khan Instagram

ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్, సింగర్ నిక్ జోనాస్‌ను 2018 సంవత్సరంలో వివాహం చేసుకుంది. అయితే అంతకుముందు, ప్రియాంక చోప్రా వివాహం చేసుకోవ‌డానికి ఒక భార‌త క్రికెట‌ర్ ను ఎంచుకుంది. ఎందుకు అనే విష‌యాన్ని కూడా ప్రియాంక చోప్రా చెప్పారు. 


అవును ఇదే నిజ‌మే.. ! ప్రియాంక చోప్రా గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఒక వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అందులో ఆమె ఈ టీమ్ ఇండియా క్రికెటర్‌ని వివాహం కోసం ఎంపిక చేసింది. ఈ వీడియో 2000 సంవత్సరంలో ప్రియాంక మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నప్పటిది. జడ్జి ప్యానెల్‌లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షారుక్ ప్రియాంకను ప్రశ్నించగా.. త‌న ప్రశ్న కాస్త ఊహాత్మకమైనదని పేర్కొంటూ మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?  ప్రియాంక‌ను ప్ర‌శ్నించి మూడు ఆప్షన్లు ఇచ్చారు. 

వివాహం కోసం గొప్ప భారతీయ క్రీడాకారుడు అజర్ వంటి వ్యక్తిని ఎన్నుకుంటారా? లేదా మీకు ఆభరణాలు-నెక్లెస్‌లను కొనుగోలు చేసే స్వరోవ్‌స్కీ వంటి కళాత్మక వ్యాపారవేత్తను ఎంచుకుంటారా లేదా ఊహాజనిత పెళ్లికి సంబంధించిన కష్టమైన ప్రశ్నలు అడుగుతున్న నాలాంటి హిందీ సినిమా నటుడిని ఎంపిక చేసుకుంటారా? అని షారుఖ్ ప్ర‌శ్నించారు.

అయితే,  తాను ఏ క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంటానంటూ ప్రియాంక చోప్రా చెప్పింది. ఈ స‌మాధానం అక్క‌డున్న‌ అంద‌రినీ ఆశ్చర్యం కలిగించింది. భారత క్రీడాకారుడు మహ్మద్ అజారుద్దీన్ ను పెళ్లాడాలనుకుంటున్నట్లు ప్రియాంక తెలిపింది. దేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి త‌న భర్త అయితే తాను గర్విస్తానని చెప్పింది. 

ప్రియాంక చోప్రా చివ‌ర‌కు హాలీవుడ్ స్టార్ నిక్ ను వివాహం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్-ప్రియాంకల గురించి ల‌వ్ ఫుకార్లు కూడా గ‌తంలో వ‌చ్చాయి. వీరిద్ద‌రూ డాన్, డాన్-2 చిత్రాలలో కలిసి న‌టించారు.

Latest Videos

click me!