కుల్దీప్ యాదవ్ కెరీర్ ఇలా అవ్వడానికి కారణమెవ్వరు... అటు ఐపీఎల్‌లో అలా, ఇటు టీమిండియా ఇలా...

First Published Dec 14, 2021, 1:07 PM IST

టీమిండియాకి దొరికిన అరుదైన స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఒకడు. చైనామెన్ యాక్షన్‌తో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్, కెరీర్ ఆరంభంలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే అంతలోనే జట్టుకి దూరమై, కెరీర్‌ ముగింపు దశకు చేరుకున్నాడు...

2017 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కుల్దీప్ యాదవ్, 8 టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు. 65 వన్డేల్లో 107 వికెట్లు, 21 టీ20 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు..

భువనేశ్వర్ కుమార్ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ ఐదేసి వికెట్లు తీసిన భారత బౌలర్‌‌గా రికార్డు క్రియేట్ చేశాడు కుల్దీప్ యాదవ్.. ఈ ఘనత సాధించిన ఏకైక భారత స్పిన్నర్ కుల్దీప్...

2017లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో హ్యాట్రిక్ తీసిన కుల్దీప్ యాదవ్, 2019లో వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ తీసి.. వన్డేల్లో రెండు హ్యాట్రిక్ తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన కుల్దీప్ యాదవ్, వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా ఉన్నాడు...

అంతేకాదు గత 14 ఏళ్లల్లో ఆస్ట్రేలియాలో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ యాదవ్‌కి రికార్డు ఉంది... 

అయితే భారత మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత కుల్దీప్ యాదవ్ కెరీర్‌ గణాంకాలు దిగజారుతూ వస్తున్నాయి...

2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన ఆఖరి టెస్టులో ఐదు వికెట్లు తీసి అదరగొట్టిన కుల్దీప్ యాదవ్‌ను మెచ్చుకుంటూ విదేశాల్లో కుల్దీప్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడిస్తామని మాట ఇచ్చాడు అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి...

అయితే 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత కుల్దీప్ యాదవ్, ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చొని, అవకాశం కోసం ఎదురుచూస్తూ గడిపేసిన మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

ఆస్ట్రేలియా టూర్ 2020-21 టెస్టు సిరీస్‌కి ఎంపికైన కుల్దీప్ యాదవ్, నాలుగు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

ఆఖరికి అశ్విన్, జడేజా వంటి సీనియర్ స్పిన్నర్లు గాయపడిన తర్వాత గబ్బాలో జరిగిన టెస్టులోనూ కుల్దీప్‌కి అవకాశం ఇవ్వలేదు టీమ్ మేనేజ్‌మెంట్... గబ్బాలో జరిగిన టెస్టులో యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం దక్కింది...

కుల్దీప్ యాదవ్‌లాంటి బౌలర్‌ అందుబాటులో ఉన్నా, అతన్ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి... అనవసర ఒత్తిడికి గురయ్యేలా చేసింది టీమ్‌ మేనేజ్‌మెంట్...

ఆఖరికి ఐపీఎల్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కి లక్ కలిసి రాలేదు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో మెయిన్ స్పిన్నర్‌గా ఉన్నాడు కుల్దీప్ యాదవ్...

2017లో 12 వికెట్లు, 2018లో 17 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత దినేశ్ కార్తీక్ కానీ, ఇయాన్ మోర్గాన్ కానీ కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు...

2019 సీజన్‌లో 9 మ్యాచులు, 2020 సీజన్‌లో కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు కుల్దీప్ యాదవ్. అందులోనూ అతనికి వచ్చిన ఓవర్లు చాలా తక్కువ...

కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్‌ను సరిగా వాడుకోకుండా, అలాగని వేలానికి కూడా వదలకుండా అతని టాలెంట్‌ను వృథా చేసింది కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్...

26 ఏళ్ల కుల్దీప్ యాదవ్, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో, అంతకుముందు ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అరకోర అవకాశాలు దక్కినా, వాటిని సరిగా వాడుకోలేకపోయాడు...

గాయం కారణంగా ఐపీఎల్ 2021 టోర్నీకి దూరమైన కుల్దీప్ యాదవ్, కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు కసరత్తులు మొదలెట్టాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల్దీప్ రీఎంట్రీ ఇవ్వడం అంత తేలికయ్యే విషయం కాదు...

click me!