నిబ్బా వేషాలు మానుకోని పృథ్వీషా... ఫిట్‌నెస్ టెస్ట్ ఫెయిల్ అయ్యాక, ఫిలాసఫీ చెబుతూ కొటేషన్స్...

Published : Mar 17, 2022, 03:53 PM IST

అండర్ వరల్డ్ కప్ 2018 గెలిచిన భారత కెప్టెన్‌గా, అదే ఏడాది టీమిండియాలోకి దూసుకొచ్చాడు పృథ్వీషా. ఆరంగ్రేటం టెస్టులోనే అద్భుత శతకంలో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పృథ్వీషా... కొద్దిరోజుల్లోనే జట్టులో చోటు కోల్పోయాడు...

PREV
113
నిబ్బా వేషాలు మానుకోని పృథ్వీషా...  ఫిట్‌నెస్ టెస్ట్ ఫెయిల్ అయ్యాక, ఫిలాసఫీ చెబుతూ కొటేషన్స్...

ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమై జట్టుకి దూరమైన పృథ్వీషా... ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్‌తో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో పడ్డాడు...

213

సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ టెక్నిక్, బ్రియాన్ లారా బ్యాటింగ్ స్టైల్, వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు కలగలిస్తే పృథ్వీషా అని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన కామెంట్లు... తెగ వైరల్ అయ్యాయి...
 

313

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భారత ఆటగాళ్లకి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది బీసీసీఐ...

413

సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా వంటి భారత క్రికెటర్లు... ఈ ఫిట్‌నెస్ క్యాంపులో పాల్గొన్నారు...

513

ఈ ఫిట్‌నెస్ క్యాంపులో యోయో టెస్టు పాస్ అవ్వకపోతే, ఐపీఎల్ 2022 సీజన్ కూడా ఆడనిచ్చేది లేదంటూ భారత ఆటగాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేసింది బీసీసీఐ...

613

ఈ టెస్టుని ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా క్లియర్ చేశాడు. బ్యాటింగ్‌లో ఫిట్‌నెస్ చాటుకోవడమే కాకుండా 135+కి.మీ.ల వేగంతో బౌలింగ్ కూడా చేశాడు...

713

అయితే పృథ్వీషా మాత్రం ఈ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. దూకుడుగా ఆడే పృథ్వీషాను వైట్ బాల్ క్రికెట్‌లో ఆడించాలని భావించింది బీసీసీఐ. అయితే షా మాత్రం ఫిట్‌నెస్ నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు...

813

హార్ధిక్ పాండ్యా ఫెయిల్ అయి ఉండే, ఫిట్‌నెస్ సాధించేవరకూ ఐపీఎల్ 2022 సీజన్ కూడా ఆడవద్దని ఆదేశాలు వెళ్లేవి. అయితే పృథ్వీషా విషయంలో మాత్రం అలా జరగలేదు...

913

ఫిట్‌నెస్ టెస్టు కూడా క్లియర్ చేయని పృథ్వీషాని, టీమిండియాకి సెలక్ట్ చేయాలనే ఆలోచనను విరమించుకున్న బీసీసీఐ, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆడేందుకు అనుమతించింది...

1013

ఈ సంఘటన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషాను ట్రోల్ చేస్తూ వేల పోస్టులు, మీమ్స్‌ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి... దీంతో పృథ్వీషా బాగా హార్ట్ అయ్యాడు...

1113

‘నేను ఎలాంటి పరిస్థితుల్లో తెలియనప్పుడు, దయచేసి నన్ను జడ్జ్ చేయకండి... మీ ఖర్మలకు మీరే బాధ్యులు...’ అంటూ ఓ కొటేషన్‌ను పోస్ట్ చేశాడు పృథ్వీషా...

1213

ఫిట్‌నెస్ టెస్టు ఫెయిల్ అయ్యాక, దానిపైన ఫోకస్ పెట్టాల్సింది పోయి... ఇలా కొటేషన్లు పోస్టు చేయడంతో పృథ్వీషా ఇంకా నిబ్బా వేషాలు మానుకోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

1313

ఐపీఎల్ 2020 సీజన్‌లో డకౌట్ అయి పెవిలియన్ చేరిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో డిన్నర్ చేస్తూ కనిపించాడు పృథ్వీ షా... అతనో టిపికల్ క్యారెక్టర్ అని, భరించడం చాలా కష్టమని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories