టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... సెంచరీ మార్కు అందుకుని రెండున్నరేళ్లు దాటిపోయింది. విరాట్ బ్యాటు నుంచి పరుగులు వస్తున్నా, సెంచరీ మార్కు మాత్రం అందకుండా ఊరిస్తోంది. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నాడు...
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 246 బంతుల్లో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్...
212
జో రూట్‌కి గత 15 నెలల కాలంలో ఇది 8వ టెస్టు సెంచరీ కావడం విశేషం. గత ఏడాది 6 టెస్టు సెంచరీలతో టెస్టుల్లో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు జో రూట్...
312
యాషెస్ సిరీస్‌లో సెంచరీ మార్కు అందుకోలేకపోయిన జో రూట్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
412
2021 ఏడాది ఆరంభంలో 17 సెంచరీలతో ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్‌ల తర్వాతి స్థానంలో ఉన్న జో రూట్, ఇప్పుడు టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చేశాడు...
512
2019లో టెస్టుల్లో 27వ సెంచరీ చేసిన కోహ్లీ, రెండున్నరేళ్లుగా సెంచరీ అందుకోలేక అదే ఫిగర్ దగ్గర ఆగిపోగా... 2021లో ఆడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్... 27 టెస్టు శతకాలతో విరాట్‌తో సమంగా ఉన్నాడు...
612
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా 2021 నుంచి సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. కెరీర్‌లో 24 టెస్టు సెంచరీలు చేసిన కేన్ విలియంసన్, టాప్ 4కి పడిపోయాడు...
712
వరుసగా 8 సెంచరీలు చేసి టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకోవడానికి 160 పరుగుల దూరంలో ఉన్న జో రూట్... టాప్ క్లాస్ టెస్టు బ్యాటర్‌గా నిరూపించుకుంటున్నాడు...
812
ఓవరాల్‌గా ప్రస్తుత తరంలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు జో రూట్. జో రూట్‌కి 41 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి...
912
విరాట్ కోహ్లీ 70 అంతర్జాతీయ సెంచరీలతో టాప్‌లో ఉంటే, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43, క్రిస్ గేల్ 42 సెంచరీలతో టాప్ 3లో ఉన్నాడు...
1012
భారత నయా సారథి రోహిత్ శర్మ 41 సెంచరీలతో టాప్ 4లో ఉండగా జో రూట్, హిట్ మ్యాన్ రికార్డును సమం చేశాడు...
1112
న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ 40 సెంచరీలు చేయగా, స్టీవ్ స్మిత్ 38, కేన్ విలియంసన్ 37 అంతర్జాతీయ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు...
1212
వెస్టిండీస్‌పై జో రూట్‌కి ఇది ఐదో టెస్టు సంచరీ కాగా, విండీస్‌పై 4 టెస్టు సెంచరీలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అతను అధిగమించాడు...