నా దృష్టిలో ఈ ముగ్గురే ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్లు... పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

Published : Mar 17, 2022, 02:59 PM IST

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. నిప్పులు చెదిరే బంతులు, బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించే బౌన్సర్లు వేసే షోయబ్ అక్తర్, తన దృష్టిల్లో ముగ్గురే ముగ్గురు ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లంటూ చెప్పుకొచ్చాడు...

PREV
17
నా దృష్టిలో ఈ ముగ్గురే ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్లు... పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై స్పందించిన పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు...

27

‘షేన్ వార్న్‌తో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయనది ఎంతో మంచి మనసు, చాలా పెద్ద మనసున్న మనిషి...  

37

షేన్ వార్న్ నాకు మంచి ఫ్రెండ్. అద్భుతమైన బౌలర్. ఆయన స్పిన్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా, వార్న్ బౌలింగ్‌లో పేస్ కూడా దాగి ఉండేది...

47

షేన్ వార్న్ మరణవార్త విని సాక్ అయ్యాడు. ఇంత చిన్న వయసులో వెళ్లిపోవడం బాధాకరం. ఆయన గొప్ప క్రికెటర్లలో ఒకరు... 

57

నా వరకూ వసీం అక్రమ్, సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్... ఈ ముగ్గురూ క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ క్రికెటర్లుగా మిగిలిపోతారు...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...

67

145 టెస్టుల్లో 708 వికెట్లు తీసిన షేన్ వార్న్, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి... ఆల్‌టైం హైయెస్ట్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే...
 

77

మార్చి 4న థాయ్‌లాండ్‌లో ఓ విల్లాలో గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయారు షేన్ వార్న్. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించిన వార్న్, స్మారక సభకు లక్షకు పైగా క్రికెట్ ఫ్యాన్స్ హాజరయ్యారు...

click me!

Recommended Stories