పృథ్వీషా మరో భారీ సెంచరీ... మయాంక్ అగర్వాల్ రికార్డు బ్రేక్...

First Published Mar 11, 2021, 12:39 PM IST

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో ఘోరంగా ఫెయిల్ అయి, భారత జట్టుకి దూరమైన తర్వాత యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా... సంచలన ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. 

విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో నాలుగో సెంచరీ బాదిన పృథ్వీషా... టోర్నీ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 122 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 165 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ముంబై కెప్టెన్ పృథ్వీషా.
undefined
విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పృథ్వీషా... ఇంతకుముందు విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
undefined
హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే అవుటైన పృథ్వీషా, ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 89 బంతుల్లో 105, పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 152 బంతుల్లో 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 36, మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు చేసి అవుట్ కాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్సర్లతో 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
undefined
మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో 754 పరుగులు చేసిన పృథ్వీషా, విజయ్ హాజరే ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
undefined
2018 సీజన్‌లో మయాంక్ అగర్వాల్, 723 పరుగులు చేయడమే ఇప్పటిదాకా విజయ్ హాజరే ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు. దాన్ని అధిగమించిన పృథ్వీషా, 754 పరుగులతో టాప్‌లో నిలిచాడు.
undefined
ఇప్పటిదాకా ఆరు మ్యాచులు ఆడిన కర్ణాటక యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ 673 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రెండో సీజన్‌లో పడిక్కల్ సెంచరీ చేస్తే, పృథ్వీషా రికార్డు కూడా చేధించినట్టు అవుతుంది.
undefined
click me!